Monday, August 24, 2020

భగవద్గీత చదవండి

భగవద్గీత
(నాకు నేనే శత్రువు ! నాకు నేనే మిత్రుడు!).....
....
మెసెడోనియా రాజైన అలెగ్జాండర్‌ జైత్రయాత్రకు బయలుదేరినప్పుడు తన దేశంలోని గొప్ప తత్త్వవేత్తలలో ఒకడయిన డియోజినస్ దగ్గరకు వెళ్ళాడు!
.
ఆయన ఉపదేశం పొందాలన్న ఆశతో!
.
 ఆ సమయంలో ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద తనలో తానే ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ  కాలుమీద కాలేసుకుని దర్జాగా సేదతీరుతున్నాడు ఆ మహాత్ముడు.
.
 అలెగ్జాండరు వినయంగా ఆయన దగ్గర నిలుచొని తనకేదయినా ఉపదేశించమని ప్రార్ధించాడు!.
.
అప్పుడు ఆ మహానుభావుడు అడిగాడు,
 "నీవిప్పుడు ఏం చేయదలచుకున్నావు?" అని!
.
ముందు పర్షియా ను జయిస్తాను  చెప్పాడు అలెగ్జాండర్
.
ఆ తరువాత ?
అని ప్రశ్నించాడు డియోజినస్,  ఈజిప్టు అని జవాబిచ్చాడు అలెగ్జాండర్.
.
 తరువాత?
.
 మెసపొటేమియా!
.
 ఇట్లా ఆయన అడగటం
ఈయన చెప్పటం !
.
ప్రపంచంలో ని రాజ్యాలన్నీ అయిపోయేదాకా చెపుతూనే ఉన్నాడు అలెగ్జాండర్‌!
.
ప్రపంచవిజేత అయిన తరువాత ఏం చేస్తావు?
అని అడిగాడు డియోజనస్!
.
మెసడోనియా తిరిగి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పాడు అలెగ్జాండర్.
.
ఈ సమాధానం విన్న వెంటనే డియోజినస్ తను పడుకున్న చోటినుంచి కాస్త పక్కకు జరిగి,

రా! నా ప్రక్కన పడుకో!
.
 విశ్రాంతి తీసుకోవడానికి నీవు అన్ని రాజ్యాలు జయించి అంత రక్తపాతం సృష్టించాలా!
.
అని అడిగాడు!..డియోజినస్.
.
ప్రపంచంలో ఇక జయించడానికి ఏమీలేదు అని అనుకునేంతదాక యుద్ధాలు చేస్తూనే ఉండాలి !
అని అనుకున్నాడు అలెగ్జాండర్‌!
.
అలానే! నేడు కొత్తరకం అలెగ్జాండర్లు బయలుదేరారు!
.
సంపాదన,సంపాదన,సంపాదన
ఒకటే సంపాదన ......
సంపాదించటమే విజయం !
అనే దృక్పధం పెరిగిపోయింది నేడు!
 అందులోని వత్తిడులు దానివల్ల వచ్చే రకరకాల రోగాలు!
.
Life style disorders అని పేరు పెట్టుకున్నాం!
.
ఒక మనిషికి ఎంతకావాలి?
.
ఈ ప్రశ్న దాదాపుగా మనమెవ్వరమూ ఇంతవరకూ వేసుకోలేదు అని అనుకుంటున్నా! ఎవరైనా వేసుకున్నారా?
.
లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారమ్ము మింగపోడు!...
.
ప్రపంచం అంతా జయించాడు!
అన్ని దేశాల సుందరీమణులు, అతిలోక సౌందర్యవతులు తనను వరించి వచ్చారు, అయినా రావణునికి కాంక్షతీరలేదు!
ఇంకేదో కావాలి!
 సీతమ్మను చెరబట్టాడు!
చివరకు రాముడి చేతిలో మొత్తం సబాంధవంగా హతుడయ్యాడు !.....
.
అలానే నోటి దురుసుతనం ప్రాణాంతకమవుతుంది!
.
తన మేనమామ కొడుకు,
తన బంధువు అని చూడకుండా పదిమందిలో కృష్ణుడిని అవమానించి ప్రాణం పోగొట్టుకున్నాడు శిశుపాలుడు!
.
తన పినతండ్రి పిల్లలు వాళ్ళు  ,  తనదగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది అని అనుక్షణం ఈర్ష్యా అసూయలతో మనసు పాడుచేసుకొని చివరకు వాటికే బలి అయిపోయాడు దుర్యోధనుడు!
.
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు మనలను ఉన్నచోట ఉండనీయవు, !
.
ధగధగా మెరిసే రాగిచెంబులాంటి మనస్సుకు పట్టే మకిలి ఈ ఆరుభావనలు!
.
ఈ భావనలను "యోగసాధన" అనే చింతపండుతో నిత్యం తోమాల్సిందే !
.
ఏ ఒక్కక్షణం కూడా బద్ధకించకూడదు!
.
అందుకే ఆమార్గం "క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గమ్ పధః" అని కఠోపనిషత్తు చెపుతుంది!
.
That path is as sharp as Razor's edge.....
.
మనిషి తనలో చెలరేగే ప్రతి భావాన్ని నిశితంగా గమనించి ఆ భావం ఎక్కడనుండి పుడుతుందో దాని మూలంలోకి వెళ్లి ఎప్పటికప్పుడు పెరికివేయాలి!
.
 లేకపోతే కలుపుమొక్కలు పుడుతూనే ఉంటాయి!
.
మనలను మనమే ఉద్ధరించుకోవాలి!
.
 మనకు మనమే శత్రువు!
మనకు మనమే మిత్రుడు!
.
అని ఎంత అనునయంగా చెపుతున్నారో పరమాత్మ!
..
ఉద్ధరేదాత్మనాత్మానామ్ నాత్మనమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః......
.
భగవద్గీత చదవండి ! చదివించండి!
****************

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము

పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

16.1 (ప్రథమ శ్లోకము)

ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా|

హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్॥6896॥

శ్రీశుకుడు వచించెను - "పరీక్షిన్మహారాజా! దేవతలు ఈ విధముగ స్వర్గమునుండి పారిపోయి దాగికొనగ దైత్యులు స్వర్గాధిపత్యమును పొందిరి. అంతట దేవమాతయైన అదితి అనాథవలె మిగుల దుఃఖించెను".

16.2 (రెండవ శ్లోకము)

ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్|

నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్॥6897॥

"ప్రజాపతియైన కశ్యపుడు చాలదినములకు పిమ్మట ఒకనాడు తన తపస్సమాధి నుండి మేల్కొనెను. అప్పుడప్ఫుడతడు అదితి ఆశ్రమమునకు ఏతెంచెను. అచట సుఖశాంతులుగాని, ఏవిధమైన ఉత్సాహముగాని,…

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

649వ నామ మంత్రము

ఓం అదృశ్యాయై నమః

దర్శింప వీలుకాని సత్, చిత్, ఆనందం అను ఈ మూడు లక్షణములు కలిగి, అదృశ్యా అను నామముతో వశిన్యాదులచే స్తుతింపబడిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అదృశ్యా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును  ఓం అదృశ్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులను ఆ తల్లి వారి భక్తికి సంతసమంది సర్వాభీష్టములను సిద్ధింపజేసి, ఆత్మసాక్షాత్కారము కలిగించి తరింపజేయును.

పంచ లక్షణములైన అస్తి, భాతి, ప్రియం, రూపం నామం అను వాటిలో మొదటి మూడు పరమాత్మ లక్షణములు. ఈ మూడు లక్షణములే సత్, చిత్, ఆనందము అంటారు. ఈ లక్షణములు గల పరమాత్మ దృగ్గోచరము కాదు. అనగా ఈ చర్మచక్షువులతో చూడలేము.  కంటికి చూపు, చెవులకు వినికిడి, మిగిలిన ఇతర ఇంద్రియములకు ఆయా లక్షణములను ప్రసాదించునది ఆ పరమాత్మయే.  మనకున్న ఇంద్రియాలతో పరమాత్మ  గురుంచి తెలుసుకోలేము, కంటితో చూడలేము. అందుకే ఆ పరమేశ్వరి అదృశ్యా అను నామ మంత్రముతో  వశిన్యాదులచే ప్రస్తుతింపబడినది. ఇంతకు ముందు నామంలో ఆ జగన్మాతను లీలాక్లప్త బ్రహ్మాండ మండలా అని స్తుతించాము. అంటే బ్రహ్మాండాలన్నీ ఆ తల్లి చేతే సృష్టింపబడుతాయి, తనలోనే ఇముడుతాయి అని. అంటే ఎవరు ఆ తల్లిని చూడగలరు? ఒక్కరైనా చూడగలరా? చర్మచక్షువులతో, సామాన్యులకు అదృశ్య కదా ఆ తల్లి. చూడగలరు. చూసినట్లు భావించగలరు. ఎవరైతే మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథిని ఛేదించుకుంటూ, షట్చక్రములు దాటి, సహస్రారం చేరి అక్కడ అమ్మ కురిపించే సుధామృత  ధారలలో (సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ) తడిసిముద్దయిన సాధకుడు మాత్రమే అమ్మను చూశానని తృప్తినందుతాడు. గాన సాధకేతరులెవ్వరికైనా ఆ తల్లి అదృశ్యా అని మాత్రమే భావించాలి.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అదృశ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻నేడు ఆది (భాను) వారము🌹🌹🌹ఆదివారమునకు దినాధిపతి సూర్యుడు🌻🌻🌻సూర్య వంశమునకు చెందిన రఘురాముని ఆరాధించు శుభదినము🌹🌹🌹ఓం నమో రామభద్రాయ🕉🕉🕉ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

72వ నామ మంత్రము

ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః

భండుని, భండుని సైన్యాన్ని .వధించుటకు ఉద్యుక్తులయిన శక్తి సైన్యముల పరాక్రమాన్ని చూసి ఆనందించిన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ అఖిలాండేశ్వరిని   ఉపాసించు సాధకునకు అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదలు, ఆత్మానందానుభూతిని ప్రసాదించి భౌతికపరంగా కూడా సుఖసంతోషములతో జీవనం కొనసాగించి అంత్యమున పరమపదమును కటాక్షించును.

భండాసురుడు జీవాత్మ, పరమాత్మ రెండుగా భావించే అజ్ఞాని. అంతకన్నా కౄరుడు. అసుర ప్రవృత్తి గలవాడు. అహంభావి. అంటే పాంచభౌతిక శరీరమే నేను అనే మూర్ఖుడు. అరిషడ్వర్గములకు లొంగిపోయిన వాడు. ఈ జగత్తు, ఈ
శరీరమే నిత్యమని భావించేవాడు. యథా రాజా తథా ప్రజా కదా అంటే తమ ప్రభువైన భండుడే అలాంటివాడయితే అతని సైన్యం మాత్రం అందుకు తీసిపోతారా? వారు అదే ప్రవృత్తి గలవారు. నిజానికి ద్వైదీభావన (జీవుడు, దేవుడు రెండు అను భావన), అరిషడ్వర్గములను, అహంకారము (నేను అంటే ఈ శరీరమే అను తత్త్వము) ఇలాంటి బాహ్యవృత్తులను నశింపజేసి వాటితో పూర్తిగా కలుషతమైన మనస్సును ప్రక్షాళనము చేయాలి. అప్పుడు స్వస్వరూప జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞాని ముక్తుడవుతాడు. అందుకు భండుడనే బాహ్యప్రవృత్తిని నాశనం చేయడానికి పరమేశ్వరి సైన్యమనే అద్వైతశక్తులు ఉద్యుక్తులయాయి. అటువంటి సేనలను చూసి పరాశక్తి మనసు హర్షాతిరేకముతో నిండిపోయింది. అటువంటి తల్లికి వశిన్యాదులు జగన్మాతకు ఇచ్చిన అనంతకోటి నామాలలో  భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా కూడా ఒక నామమును చేర్చి, ఒక మహామంత్రముతో సమానముచేసి జగన్మాతను ప్రస్తుతించారు. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻నేడు ఆది (భాను) వారము🌹🌹🌹ఆదివారమునకు దినాధిపతి సూర్యుడు🌻🌻🌻సూర్య వంశమునకు చెందిన రఘురాముని ఆరాధించు శుభదినము🌹🌹🌹ఓం నమో రామభద్రాయ🕉🕉🕉ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము

పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అదితిరువాచ

16.11 (పదకొండవ శ్లోకము)

భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ|

త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహా ఇమే॥6906॥

అదితి పలికెను "మహాత్మా! ద్విజులు, గోవులు, ధర్మము మరియు ఈ దాసి అందరమూ కుశలమే. గృహస్థాశ్రమమే ధర్మార్థకామముల సాధనయందు పరమ సహాయకము.

16.12 (పండ్రెండవ శ్లోకము)

అగ్నయోఽతిథయో భృత్యా భిక్షవో యే చ లిప్సవః|

సర్వం భగవతో బ్రహ్మన్ననుధ్యానాన్న రిష్యతి॥6907॥

ప్రభూ! నిన్ను నేను నిరంతరము స్మరించుచునే యుందును. మరియు నీ క్షేమమునే కోరుచుందును. కనుక నేను అగ్నులను, అతిథులను, సేవకులను, మరియు యాచకులను  యథాశక్తిగా ఆదరించి, సత్కరించితిని.

16.13 (పదమూడవ శ్లోకము)

కో ను మే భగవన్ కామో న సంపద్యేత మానసః|

యస్యా భవాన్ ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్ ప్రభాషతే॥6908॥

స్వామీ! నీవంటి ప్రజాపతి ధర్మపాలనయందు నాకు ఉపదేశములను ఇచ్చుచుండగా నా మనస్సునందలి ఏ కోరికయైనను ఎట్లు తీరకుండును.

16.14 (పదకొండవ శ్లోకము)

తవైవ మారీచ మనఃశరీరజాః ప్రజా ఇమాః సత్త్వరజస్తమోజుషః|

సమో భవాంస్తాస్వసురాదిషు ప్రభో తథాపి భక్తం భజతే మహేశ్వరః॥6909॥

ఆర్యా! సత్త్వరజస్తమోగుణములు గల ప్రజలందరును నీ సంతానమే. కొందరు నీ సంకల్పము ద్వారా, మరికొందరు శరీరము ద్వారా ఉత్పన్నమైరి. అసురులు, దేవతలు అందరును నీ సంతానమే. అందరియెడ నీవు సమభావమున ఉందువనుటలో ఎట్టి సంశయమూలేదు. ఐనను సాక్షాత్తు పరమేశ్వరుడు గూడ తన భక్తుల అభిలాషలను నెరవేర్చుచునే యుండును.

16.15 (పదునైదవ శ్లోకము)

తస్మాదీశ భజంత్యా మే శ్రేయశ్చింతయ సువ్రత|

హృతశ్రియో హృతస్థానాన్ సపత్నైః పాహి నః ప్రభో॥6910॥

16.16  (పదునారవ శ్లోకము)

పరైర్వివాసితా సాహం మగ్నా వ్యసనసాగరే|

ఐశ్వర్యం శ్రీర్యశః స్థానం హృతాని ప్రబలైర్మమ॥6911॥

స్వామీ! నేను నీకు దాసిని నీవునా శ్రేయస్సునుగూర్చి ఆలోచింపుము. నీవు మర్యాదలను కాపాడుచుండువాడవు. శత్రువులు మన సంపదలను, నివాస స్థానములను గూడ లాగుకొనిరి. నీవు నన్ను రక్షింపుము. బలవంతులైన దైత్యులు మా ఐశ్వర్యములను, ధనమును, యశస్సును, కడకు నివాస స్థానమును గూడ హరించిరి. మమ్ములను మా ఇళ్ళనుండియే వెళ్ళగొట్టిరి. అందువలన నేను దుఃఖసాగరములో మునిగియున్నాను.

16.17 (పదునేడవ శ్లోకము)

యథా తాని పునః సాధో ప్రపద్యేరన్ మమాత్మజాః|

తథా విధేహి కల్యాణం ధియా కల్యాణకృత్తమ॥6912॥

మహాత్మా! నీవు తప్ప మా యశస్సును కోరెడివారు ఎవరున్నారు? నీవు నా హితైషివి. కనుక, నీ పుత్రులు కోల్పోయిన రాజ్యాదులను వారు తిరిగి పొందునట్లు ఏదైనా ఉపాయమును  ఆలోచించును. ఆ విధముగా నాకు శుభములను చేకూర్చును".

శ్రీశుక ఉవాచ

16.18 (పదునెనిమిదవ శ్లోకము)

ఏవమభ్యర్థితోఽదిత్యా కస్తామాహ స్మయన్నివ|

అహో మాయాబలం విష్ణోః స్నేహబద్ధమిదం జగత్॥6913॥

16.19 (పందొమ్మిదవ శ్లోకము)

క్వ దేహో భౌతికోఽనాత్మా క్వ చాత్మా ప్రకృతేః పరః|

కస్య కే పతిపుత్రాద్యా మోహ ఏవ హి కారణమ్॥6914॥

శ్రీశుకుడు వచించెను అదితి కశ్యప ప్రజాపతిని ఇట్లు ప్రార్థింపగా అతడు దరహాసము చేయుచు ఆమెతో ఇట్లనెను- "ఇది ఎంత ఆశ్చర్యకరము! భగవంతుని మాయ ఎంత బలీయమైనది! జగత్తు అంతయు మోహపాశముతో బంధింపబడి యున్నది పంచభూతములతో నిర్మింపబడిన, అనాత్మయైన ఈ దేహమెక్కడ? ప్రకృతికి అతీతమైన ఆత్మ ఎక్కడ? ఎవరికి ఎవ్వరును పతిగాని, పుత్రుడుగాని, బంధువుగాని కారు. ఈ అందరినీ మోహమే ఆడించుచున్నది.

16.20 (ఇరువదియవ శ్లోకము)

ఉపతిష్ఠస్వ పురుషం భగవంతం జనార్దనమ్|

సర్వభూతగుహావాసం వాసుదేవం జగద్గురుమ్॥6916॥

16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

స విధాస్యతి తే కామాన్ హరిర్దీనానుకంపనః|

అమోఘా భగవద్భక్తిర్నేతరేతి మతిర్మమ॥6916॥

దేవీ! ఆ పరమపురుషుడు సకల ప్రాణుల హృదయములయందు విరాజిల్లు చుండువాడు. తన భక్తుల  దుఃఖములను తొలగించువాడు. జగద్గురువు, భగవంతుడు ఐన వాసుదేవుని ఆరాధింపుము. ఆ శ్రీహరి దీనదయాళువు. అతడు నీ కోరికలను తప్పక నెరవేర్చును. భగవద్భక్తి ఎన్నడును వ్యర్థముకాదని నా దృఢ విశ్వాసము. ఇంతకంటె మరియొక ఉపాయము లేనేలేదు'.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319


--

పద్యాలూ

కుదువంబెట్టినపట్టుచీరె చదువన్గూర్పంగశ్రద్ధన్ గురుల్
సదయుండాహనుమంతుడే బహువిధాసక్తుల్ మదిందీర్ప తా
నెదిరిం లెక్కయొనర్పనట్టి దృఢతే నిన్విశ్వమేమెచ్చగా
కొదమంసింగముజేసె సైమనును ఢీకొట్టం బ్రకాశాహ్వయా!

త్యాగమె నిజరూపముగా
యోగమ్మేన్యాయవాదనోద్యోగము, గాం
ధీ గమనమె నీబాటగ
సాగిన ధీరా ప్రకాశ సార్థకనామా!

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం

లోకులు కాకులు....

.ఒక వూరులో ఒక పెంకుటింటి అరుగు పై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లవాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు. దానిని చూసిన ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి.

ఆనందం తో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి. అయితే.. అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది. అప్పుడు ఆ కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో వున్న బూరెను లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది. అప్పుడు ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది.

ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఇంకో కాకి చూసింది. ఎగిరిపోయిన కాకి తెలివి తక్కువతానానికి నవ్వుకుంది. ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా..

మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి. ఉత్తుత్తి బూరె కోసం కాకి పాట్లు తలుచుకుని మళ్ళీ నవ్వింది. మూడో కాకి ఈ విషయం ఇంకో కాకికి చెప్పింది. 'అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా' అంటూ ముగించింది. తన వర్ణనలో 'ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం' అనే విషయం చేర్చలేదు.

ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. 'తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడానూ' అంటూ మరో మాట చేర్చింది. ఈ కాకులు అన్ని ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి.

వాటిలో ఓ కాకి అయితే 'కాకి కన్ను పొడిస్తే.. పాపం.. రక్తం కారిందట కూడానూ' అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్లి 'ఆ గోడపై రక్తపు చారికలు చూసాను' అంటూ వాపోయింది. మరో కాకి 'నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది' అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది.

అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడి కాకిగా ముద్రవేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. ఇవేమీ ఎరుగని మొదట కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులును స్నేహంగా చూసింది. అప్పటిదాకా గుసగుసలాడుకున్న కాకులు చప్పున మాటలు ఆపి మూగ భావంగా తలలు తిప్పుకున్నాయి.

కాకికి ఏమి అర్థంకాలేదు. రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులు తున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది.

"ఒక్కోసారి అంతే.. మన ప్రమేయం ఏమి లేకుండానే మనని సమాజం చెడ్డ వాళ్ళని చేసేస్తుంది. నీలాప నిందలు, పుకార్లమయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధ పడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకోండి చాలు. అలాంటి వందల మంది నీకేలా.." అంటూ ఓదార్చింది కొమ్మమీద ఒక కోయిలమ్మ..

సూక్తి... ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, అతనితో స్నేహం చేయకుండా, అతనిని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లు నమ్మటం, పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వలన, ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోవటమే కాదు, అదే సమాజంలో నీ విలువ కూడా పోగొట్టుకుంటున్నావనే విషయాన్ని  గ్రహించాలి...

అందుకే.. లోకులు కాకులు అన్న సూక్తి ఊరుకునే రాలేదు సుమీ.
*****************

పూర్వ భారతము



కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్
* లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
* తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
* పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం * మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
* నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
* జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
* మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప ్రదేశ్
* శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
* దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
* పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
* మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
* నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
* వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
* నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
* రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
* సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర
* హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
* మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
* వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
* కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్
* మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
* ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
* గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా
* కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
* పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
* కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్
* శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
* హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
* కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
* చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
* కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్
* ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
* కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
* పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
* కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్
* జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్
* కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
* మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
* విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
* శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
* ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
* నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
* జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
* కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్ See* బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
* గౌతమ బుద్ధుడు పరినిర్య ాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్
********************


అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు

ప్రశ్నికుడు:-
1 . రైలు పట్టాలకూ,
     కాలి పట్టాలకూ
     అనుబంధం ఏమిటి?

అవధాని:-
రైలు పట్టాల మీద వుంటుంది,
కాలి మీద పట్టాలుంటాయి.

ప్రాశ్నికుడు:-
2 . కనలేని స్త్రీమూర్తి ఎవరు?

అవధాని:-
న్యాయస్థానములో వున్న
న్యాయదేవత. కళ్ళకు గంతలు కట్టి వుంటారు కదా!

ప్రా:-
3 . సోమవారాన్ని 'మండే'       అనెందుకంటారు?
అవ:-
ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా సోమవారం పొద్దున్నే
పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా!
అందుకని 'మండే' అంటారు.
ప్రా:-
4 . ఒక పిల్లవాడు ఇంటినుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?
అవ:-
కని-పెంచుట లేదు .
ప్రా:-
5 . ఈ రోజుల్లో పిల్లలు
     తల్లిని Head Cook గా
     చూస్తున్నారు .
     మరి తండ్రిని
     ఎలాచూస్తున్నారు?
అవ:-
ATM లాగా చూస్తున్నారు.
ప్రా:-
6 . సభలో ఎవరైనా
      ఆవులిస్తే మీరేమి చేస్తారు?
అవ:-
పాలిచ్చేవైతే అవధానం
అయ్యాక యింటికి తోలుకెళ్తా .
ప్రా:-
7 . మనిషికి
      ఆనందాన్నిచ్చే సిటీ ఏది?
అవ:-
'పబ్లిసిటీ '
ప్రా:-
8 . తుద+ తుద = తుట్టతుద,
      కడ  + కడ = కట్టకడ
      అవుతుంది కదా!
      అరటి + అరటి
      ఏమవుతువుంది?
అవ:-
అర టీ + అర టీ
ఫుల్ టీ అవుతుంది.
ప్రా:-
9 . క్రికెట్ ప్లేయరుకీ,
     అవధానికీ
     సామ్యం ఉందా?
అవ:-
వాళ్ళు  world play కి వెళ్తారు ,
మేము  words play కి వెళ్తాము.
ప్రా:-
10 . 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నాడు వేమన, ఇప్పుడు మీరేమంటారు?
అవ:-
"పురుషులందు
పుణ్యపురుషులు
ఏరయా? అంటాను.
ప్రా:-
11 . దేవుని గుడికి
        తాళం వెయ్యాలా?       
అవ:-
భజన జరిగే చోట
తాళం తప్పనిసరి.
ప్రా:-
12 . అద్దం ముందున్న
        ఆడువారికీ,
        మైకు ముందున్న
        అమాత్యులకీ
        తేడా ఏమిటి?
అవ:-
ఇద్దరికీ సమయం తెలియదు!

 చదివి ఆనందించండి - పద ప్రయోగ వినోదాన్ని పదిమందికీ పంచండి......ఇట్లు ఒద్దిరాజు రంగారావు..స్వచ్ఛమైన.నవ్వు నవ్వండి మన భాషను అందులోని గాంభీర్యాన్ని సొబగులను తెలుసుకోండి.👏

వినాయకునికి పద్యాల నైవేద్యం

వినాయకచవితి తెలుగువాళ్ళకి ఆహ్లాదకరమైన పండగ. వినాయకుడంటే తెలుగువాళ్ళందరికీ ఒక రకమైన ఆప్యాయత. ఎందుకో మరి! అతని రూపమే చిత్రం! అతని వాహనం మరీ విచిత్రం! ఇష్టమైన పిండివంటలు సరే సరి! మరే దేవుణ్ణైనా మనం గడ్డితో పూజిస్తామా! అతనితో ఎన్ని సరదాలు, మరెన్ని సరాగాలు! ఆ చనువుతోనే కాబోలు నిన్న రాత్రి ఎలక గుఱ్ఱాన్నెక్కి సరాసరి నా కల్లోకి వచ్చేసి పిచ్చాపాటీ మొదలుపెట్టాడా స్వామి!

వినాయకుడు: రేపు వినాయకచవితి గుర్తుందా!

నేను: అయ్యో ఎంత మాట! నాకు గుర్తులేకపోవడమేమిటి, మాకు సెలవు కూడానూ!

వినాయకుడు: అయితే మరి నాకేం నైవేద్యం పెడుతున్నావ్?

నేను: అదీ...మరీ...స్వామీ... మా ఆవిడ ఉండ్రాళ్ళో ఏవో చేస్తానంది. ఆవిడ దయా మీ ప్రాప్తం!

వినాయకుడు: అది కాదోయ్! నువ్వు పెట్టే నైవేద్యమేవిటీ అని అడుగుతున్నా...

నేను: నేనా? ఏంటంటున్నారు స్వామీ?

వినాయకుడు: అదేనయ్యా, నీ బ్లాగులో పండగలకీ పబ్బాలకీ పద్యాలు వేస్తున్నావు కదా! ఆ తెలుగు పద్యాల ప్రసాదం గురించి నేనడుగుతున్నది.

నేను: ఓ, అదా! అయినా మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా అని...

వినాయకుడు: అదేంటయ్యా అలా అంటావ్! అసలు నాకు సంస్కృతశ్లోకాల కన్నా తెలుగు పద్యాలే ప్రీతిపాత్రం తెలుసా!

నేను: అవునా స్వామీ! అదేం?

వినాయకుడు: నన్ను తల్చుకోగానే అందరికీ గుర్తుకొచ్చే సంస్కృత శ్లోకం ఏంటో చెప్పు.

నేను: శుక్లాంబరధరం విష్ణుం...

వినాయకుడు: అవునా! మరి నన్ను తల్చుకోగానే గుర్తుకొచ్చే మీ తెలుగు పద్యం ఏవిటి?

నేను: తోండము నేకదంతమును...

వినాయకుడు: ఊ...పూర్తిగా చదువు.

నేను:
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్
కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!

వినాయకుడు: చూసావా! నువ్వు చదివిన ఆ సంస్కృత శ్లోకం నేనుకూడా చాలా కాలంనుంచీ నా గురించే అనుకుంటున్నాను. కానీ కొంతమంది అది నాది కాదు, అసలందులో నాగురించి ఏవిటుందని సందేహం వెలిబుచ్చారు. దాంతో నాక్కూడా అనుమానం వచ్చేసింది, అది నా గురించేనా అని. అదే మీ తెలుగు పద్యం చూడు. స్పష్టంగా, వివరంగా నా గురించి ఎంత చక్కగా చెప్తోందో! అందికే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం!

నేను: బావుంది స్వామీ! మీకు తెలుగు పద్యాలిష్టమని విని చాలా ఆనందంగా ఉంది!

వినాయకుడు: మీ తెలుగు కవులు ఎన్నెన్ని రకాలుగా నన్ను ప్రస్తుతించారు! అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జ నిండిపోతుందనుకో!

నేను: అలాగా!

వినాయకుడు: అవునయ్యా! అతనెవరూ... జిగిబిగి కవిత్వం రాసాడు. ఆ... అల్లసాని పెద్దన. అతను బలే గడుసువాడు సుమా! నా గురించి బలే పద్యాన్ని రాసాడు. ఏదీ ఆ పద్యం ఒక్కసారి చదివి వినిపించూ.

నేను:
అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!

వినాయకుడు: తస్సాదియ్యా! కవంటే ఇతనేనయ్యా. నాక్కూడా ఎప్పుడూ రాలేదిలాంటి అల్లరి ఆలోచన! దీనికి మీ విమర్శకులేవో చాలా లోతైన విశ్లేషణలు చేస్తారు. అసలిది నా గురించే కాదనీ ఏదో వేదాంతం చెప్తారు. కానీ నాకవేవీ పట్టవు. నా గురించి అలాటి చమత్కారమైన ఆలోచన చేసాడు చూడూ! అది నాకు బలే బలే అద్భుతంగా అనిపించింది.

నేను: అవును స్వామీ! పెద్దనవలె కృతిసెప్పిన పెద్దనవలె అని అందుకేగా మేం అనుకునేది! అయితే ఇంతకన్నా ముందే కేతన కవి ఇలాంటిదే మరో చిత్రమైన ఆట మీచేత ఆడించాడు స్వామీ!

వినాయకుడు: అవునా! ఎందులో? ఏదీ ఆ పద్యం కూడా వినిపించు మరి.

నేను: ఈ పద్యం దశకుమారచరిత్రములోది. వినండి.
గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!

వినాయకుడు: ఓరి మీ అసాధ్యంగూలా! మీ తెలుగుకవులు భలే వాళ్ళయ్యా! నా చేత ఎన్నెన్ని చిత్రమైన చేతలు చేయించారూ! నా రెండు చేతులతోనూ మా నాన్న రెండు కళ్ళూ మూసేసి, మా నాన్న మూడో కంటిని నా మూడో చేత్తో, "హస్తంతో", అంటే తొండంతో మూసేసానా! ఆ నిప్పుకంటి జోలికి వెళితే నా తొండమేం గానూ!

నేను: పొండి స్వామీ మీరు మరీను! పరమేశ్వరుని చిత్తం చిగురిస్తే, ఆ కన్ను మంటలు కురిపిస్తుందా ముద్దులు కురిపిస్తుంది కానీ.

వినాయకుడు: ఆలా అంటావా! అయితే ఓకే. ఇంతకీ, నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పు?

నేను: నన్నెచోడుడు అనుకుంటాను స్వామీ!

వినాయకుడు: ఓహో! అతనే కదూ మా తమ్ముడు పుట్టుకగురించి కుమారసంభవం తెలుగులో రాసిన కవి. ఏదీ అతను రాసిన పద్యం వినిపించు.

నేను: చిత్తం.
తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ
ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై
చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా
జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!

వినాయకుడు: బావుందయ్యా! నన్ను కాస్తా నల్లనివాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే యీ కవి! మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా! ఇంకా ఎవరెవరు ఏం చమత్కారాలు చేసారో త్వరగా వినిపించు.

నేను: కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామీ. అతను రామరాజభూషణుడు, ఉరఫ్ భట్టుమూర్తి. ఆ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు. మీరే వివరించాలి!

వినాయకుడు: ఏవిటి నేనా! ఇప్పుడంత సమయం లేదే. సరే చదువు చూద్దాం.

నేను:
దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!

వినాయకుడు: అబ్బో, యీ భట్టుమూర్తి చాలా ఘటికుడయ్యా! వాక్యాలని అటూ ఇటూ చేసి అన్వయం కష్టం చేసిపారేసాడు! మధ్యలో శ్లేష ఒకటి!
నా తొండంతో ముందు గంగ నీళ్ళన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట! తర్వాత నా దంతంతో వెండి కొండని ఒక్కసారి కదిలిస్తే, ఆ ఊపుకి, మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా హత్తుకొందిట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించేనట. ఇలా తల్లిదండ్రులిద్దరికీ ఆనందాన్ని చేకూర్చి నేను వాళ్ళ కుమారులలో అగ్రస్థానాన్ని (కుమారస్వామికి అన్ననే కదా!) సంపాదించానట. దానికి నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి!

నేను: బాగా వివిరించారు స్వామీ! స్వయంగా మీ నోటితో దీని వివరణ వినడం పరమానందంగా ఉంది!

వినాయకుడు: అది సరేగానీ, ఇన్నేసి చమత్కారాలు గుప్పించిన పద్యాలు కాకుండా, వినసొంపుగా హాయిగా మనసుకి హత్తుకొనే పద్యాలు ఎవరూ రాయలేదా?

నేను: ఎందుకు రాయలేదు స్వామీ! అలాటివాటికి పెట్టింది పేరు పోతన, ఆ తర్వాత కొంతవరకూ మొల్ల.

వినాయకుడు: అయితే తొందరగా వినిపించు మరి!

నేను: పోతన తనకి సహజమైన అంత్యప్రాసలతో రాసిన పద్యం ఇదిగో:

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!

వినాయకుడు: ఆహా! పోతన పద్యంలో తీయని మకరంద ధార జాలువారుతునే ఉంటుంది. మరి మొల్ల పద్యమో?

నేను: చిత్తం సిద్ధం!

చంద్రఖండ కలాపు జారు వామనరూపు
గలిత చంచలకర్ణు గమల వర్ణు
మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహు
భద్రేభవదను సద్భక్తసదను
సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు
ననుదినామోదు విద్యాప్రసాదు
బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు
నురుతరఖ్యాతు నాగోపవీతు

లోకవందిత గుణవంతు నేకదంతు
నతుల హేరంబు సత్కరుణావలంబు
విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు
బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!

వినాయకుడు: చాలా బావుంది! సీసంలోని తూగు మరే పద్యానికొస్తుంది! అన్నట్టు సీసమనగానే గుర్తుకొచ్చింది. అసలుసిసలు తెలుగుకవి, మీ శ్రీనాథ కవిసార్వభౌముడు నా గురించేమీ రాయలేదా?

నేను: అయ్యో పొరపాటైపోయింది స్వామీ! మరచిపోయాను. ఇదిగో మీ గురించి అతను రాసిన సీసం!

కలితశుండాదండ గండూషితోన్ముక్త
సప్తసాగర మహాజలధరములు
వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ
మేదినీధర రత్నమేఖలములు
పక్వ జంబూఫల ప్రకటసంభావనా
చుంబిత భూభృత్కదంబకములు
వికట కండూల గండక దేహమండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు

శాంభవీశంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి గావించు గాత!

వినాయకుడు: అబ్బబ్బా! ఏవి ధారా, ఏవి ధారా! ఇందుకేగా ఇతన్ని ప్రసిద్ధ ధారాధుని అని పిలిచేది. సెభాష్!
అవునూ, నువ్వందరూ పాతకవులనే చెప్తున్నావ్, ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి?

నేను: అయ్యో లేకేం స్వామీ! పైన చెప్పిన కవులందరూ తమ కావ్యాల్లో ఒక పద్యంలో మిమ్మల్ని స్తుతిస్తే, ఏకంగా ఒక పద్య ఖండికనే మీకు సమర్పించిన ఆధునిక కవి ఒకరున్నారు. అతనే, కరుణశ్రీ అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తన ఉదయశ్రీలో మీకు "నమస్తే" చెప్పారు.

వినాయకుడు: అవన్నీ వినడానికి ఇప్పుడు నాకు సమయం చాలదు. అవతల మీవాళ్ళందరూ నన్ను ఎన్నెన్ని రూపాల్లో తయారుచేసారో, ఎన్నెన్ని పిండివంటలు చేసారో చూడ్డానికి వాహ్యాళికి వెళ్ళాలి. నువ్వు కూడా తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవాలి కదా! మచ్చుకి ఒక్క పద్యం వినిపించు చాలు. ఆనక మిగతావి వింటాను.

నేను: సరే అలాగే స్వామీ! చిత్తగించండి.

ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరుగెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా!" యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట

అమరులందగ్ర తాంబూలమందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!

వినాయకుడు: నేను విష్ణుమూర్తిని "నల్ల మామా" అని ఆటపట్టిస్తానా! ఆహా బలే అయిడియా ఇచ్చాడే ఇతను! ఎంతైనా మీ తెలుగుకవులకి సరసం ఎక్కువే సుమీ!
మొత్తానికివాళ పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం చేసినట్టుంది! బావుంది నీ పద్య నైవేద్యం!
కాకపోతే ఇన్ని పద్యాలు చూసి నాకొకటే లోటుగా అనిపిస్తోంది.

నేను: లోటా! ఏవిటి స్వామీ?

వినాయకుడు: మీ తెలుగు కవులు ఇందరిగురించి కావ్యాలు రాసి, నా గురించి మాత్రం రాయలేదే అని వెలితిగా అనిపిస్తోంది. మా తమ్ముడు కుమారస్వామి గురించి కూడా వెయ్యేళ్ళ కిందటే ఎవరో రాసారని చెప్పావే, మరి ఇన్నాళ్ళై నా కథని ఎవరూ కావ్యంగా ఎందుకు రాయలేదు?

నేను: అవును స్వామీ! మీరు చెప్పే దాకా నాక్కూడా తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంది.

వినాయకుడు: పోనీలే. ఇంతమంది రాసిన పద్యాలు చెప్పేవు కదా. సొంతంగా నువ్వొక్క పద్యం నా గురించి యిప్పుడు చెప్పకూడదూ. విని దానితోనే సంతృప్తి పడతాను.

నేను: అయ్యో అంత కన్నా మరో భాగ్యం ఉంటుందా! అవధరించండి!

శ్రీకంఠుని సతి ప్రేమకి
నాకారమ్మైన సామి! హరుని దయన్ నూ
త్నాకృతి దాల్చిన గజముఖ!
చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగ మాకున్!

నేనిలా పద్యం చదివానో లేదో, అలా అదృశ్యమైపోయాడా గణనాథుడు! నా పద్య ప్రభావమేనో ఏమో! సరే పొద్దున్న యథావిథిగా పూజా కార్యక్రమాలు సాగించి, మా ఆవిడ చేసిన పిండివంటలు స్వామికి నైవేద్యం పెట్టి నేను తిని, ఇదిగో నా నైవేద్యాన్ని మీ ముందు పెట్టాను. ఆరగించండి మరి!
   (వాట్స్ ఆప్ సందేశం )
*********************

శ్రీ ఆంజనేయ షోడశరత్నమాలికా స్తోత్రం


1) గిరిరాజకన్యకాగర్భసంభూతాయ
  గణేశకుమారదేవదివ్యప్రభావాయ
   ఘనశ్రేష్ఠవైరాగ్యసుసంపన్నాయ
  ఆంజనేయాయ మహాబలాయ ||

2) ఘననవవ్యాకరణవినీతాయ
   రామనామాంకితదేహాయ
   సీతాన్వేషణతత్పరాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

3) దుర్లభసంజీవనపర్వతోద్ధారకాయ
   అంగదజాంబవంతాదిపూజితాయ
   రామానుజప్రాణరక్షకాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

4) సీతామనోదుఃఖనివారకాయ
   అహిమహిరావణసంహరాయ
   అశేషబలశౌర్యప్రదాయకాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

5) నాగవల్లీదళమాలాధరాయ
    గంధమాదనశైలనివాసాయ
    సకలదేవతాగణపూజితాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

6) సుగ్రీవభయవారకరాజ్యదాయ
   మంత్రయంత్రతంత్రస్వరూపాయ
   భక్తమనోరథక్షిప్రప్రదాయకాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

7) దానవభయంకరవజ్రాంగదేహాయ
   బహుభాషాకోవిదమృదుభాషణాయ
   మహిమోపేతప్రజ్ఞాశీలపంచాననాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

8) బ్రహ్మవిద్యాదాయకగురుస్వరూపాయ
   పాండవమధ్యమరధధ్వజాగ్రవాసాయ
   వారధిబంధనసమయసహాయకాయ
   ఆంజనేయాయ మహాబలాయ ||

9) ఉష్ట్రవాహనారూఢాయ
  సువర్చలాసమేతాయ
  శ్రీవిద్యాఉపాసకాయ
  ఆంజనేయాయ మహాబలాయ ||

10) యజ్ఞహవిష్యస్వీకృతపవమానస్వరూపాయ
    సుందరపావనకదళీవననివాసవిగ్రహాయ
    వరబలగర్వితరావణదర్పాపహారాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

11) వశిష్ఠకుంభోద్భవగౌతమాదిపూజితాయ
    భూతప్రేతపిశాచసంఘభయనివారకాయ
    బాలభానుకందుకభావితబాలభీమాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

12) ప్రహస్తాక్షయకుమారాదిదానవసంహరాయ
    అష్టసిద్ధినవనిధిప్రదాయకభక్తసులభాయ
    అతీవబలపరాక్రమప్రదర్శకగదాధరాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

13) రామపాదుకాశిరోధార్యభరతసమానాయ
    రామకథాశ్రవణపులకాంకితధన్యశరీరాయ
    రాజ్యపదవీకాంక్షరహితనిర్మలమానసాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

14) సూక్ష్మభావగ్రాహ్యపింగళాక్షాయ
    మైనాకస్నేహపూర్వకఆహ్వానస్వీకృతాయ
    రామసుగ్రీవస్నేహవారధిబంధనాయ
    ఆంజనేయాయ మహాబలాయ ||

15) భక్తసంక్షేమప్రదసింధూరాంకితవిగ్రహాయ
       వేదవేదాంతపూజితమృదుపల్లవపదాయ
       లంకావిదాహకఅశోకవనభంజనాయ
       ఆంజనేయాయ మహాబలాయ ||

16) కేయూరమణిమాణిక్యాభూషణమకరకుండలాయ
      సకలపాపౌఘవారణనిజభక్తహృదయమందిరాయ
      సహస్రారస్థితఆనందామృతరసపానమత్తభృంగాయ
      ఆంజనేయాయ మహాబలాయ ||

సర్వం శ్రీ ఆంజనేయదివ్యచరణారవిందార్పణమస్తు
****************

భక్తి పద్యం

ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విమలప్రభావ! రా
వే! కరుణింపవే! తలఁపవే! శరణార్థిని నన్నుగావవే!
*****************

Monday, August 3, 2020

సొంతంగా 12 రోజుల లో 9 జ్యోతిర్లింగాలను దర్శించుట ఎలా?

ఇది కేవలం హైదరాబాదు పరిసర ప్రాంతాలలో వుండే యాత్రికులకు మాత్రమే వర్తిస్తుంది. 

ఓం నమో గణాధి పతయే నమః ఓం నమః శివాయ
ఈ క్రింద తెలిపిన ప్లాన్ వీలైనంత తక్కువ ఖర్చుతో జ్యోతిర్లింగ దర్శనం కోసం వ్రాయబడినది. శివ భక్తులకు సాయ పడుదామన్న చిన్న ఆశ తో ఈ ప్లాన్ వ్రాసాను. ప్లాను లో వున్న రైళ్లు ప్రతి రోజు నడిచేవి. మీ అవసరాన్ని బట్టి మీకు కావలిసిన ఊరిలో మీరు  విశ్రమించ వొచ్చు. శివాష్టోత్తరం లేక మీకు అవసరమైన మంత్రాలూ తీసుకుకొని గుడి లో చదవండి. లేక శివ నామం స్మరించండి. అభిషేకం కొరకు రాగి లేదా వెండి పాత్ర తీసుకు వెళ్ళండి. ఈ ప్లాన్ గుడి లో ఉంటే ఇతర భక్తులకు కూడా ఉపయోగ పడును. దయ చేసి ఈ ప్లాన్ గుడి లో నే ఉంచ గలరు. నేను మీ వంటి ఒక శివ భక్తుడిని. నేను టూర్ ఆపరేటర్ ను కాను. ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి. శీఘ్రమేవ శివ దర్శన ప్రాప్తిరస్తు. Note: రైల్వే స్టేషన్ కోడ్ ని () లోపల రాసాను.
1వ రోజు: బేగంపేట్ లో రాత్రి 9:00 కి ట్రైన్ # 57549 (ఔరంగాబాడ్ పాసెంజర్) ఎక్కి మరుసటి రోజు పొద్దున్న 6:30 కి పర్లీ రైల్వే స్టేషన్ లో దిగండి. OR మీరు విజయవాడ నుంచి యాత్ర ప్రారం భిస్తుంటే, ట్రైన్# 17206 కాకినాడ సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి  లేదా ట్రైన్# 17208 విజయవాడ లో సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ పొద్దున్న 10.30 కి ఎక్కి, పర్లీ (PRLI) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:05 కి దిగండి (ప్రయాణ సమయము 13 గంటలు).
2వ రోజు: పర్లీ రైల్వే స్టేషన్ నుండి బైజనాథ్ గుడి 3KMs  దూరం లో వుంది. స్టేషన్ బైట ఆటోలు దొరుకును. ఉదయం బైద్యనాథ్ జ్యోతిర్లింగ[1] దర్శనం చేసుకున్న పిమ్మట బస్సు లో పర్భానీ () (67KMs) రైల్వే స్టేషన్ కి 10:30 AM లోగ చేరుకొని ట్రైన్# 12715 స్చఖండ్ ఎక్ష్ప్రెస్స్ 10.37 AM ఎక్కండి లేదా ట్రైన్# 17618 తపోవన్ ఎక్ష్ప్రెస్స్ 11.17 AM కి ఎక్కండి. ఔరంగాబాద్ () రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 2:30 PM కి దిగి 30 కిలోమీటర్ల దూరం లో వున్న గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించండి. గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనము (ఇక్కడ నుంచి ఎల్లోరా గుహ 1KM దూరం లో వుంది, ఏ గుహలను పూర్తి గా చూడాలంటే ఒక రోజు పడ్తుంది) గుడి దెగ్గర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.
3 వ రోజు: ఔరంగాబాద్ బస్సు స్టాండు లో నాశిక్ బస్సు ఎక్కండి. నాశిక్ బస్టాండ్ (దూరం 187 కిలోమీటర్లు) ప్రయాణ సమయం 5 గంటలు. నాశిక్ బస్సు  స్టాండ్ లో త్రియంబక్ కి వెళ్లే బస్సు ఎక్కి (దూరం 30 కిలోమీటర్లు) త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం[3] దర్శించుకోండి (రాత్రి 9:00 PM వరకు గుడి తెరచి  ఉంటుంది) దర్శనం తరువాత, గోదావరి ఆవిర్భవించిన క్షేత్రం దర్శించండి. గుడి దెగ్గర రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.
4 వ రోజు: పొద్దున్నే 06:00 AM బయలుదేరి నాశిక్ బస్సు స్టాండ్ చేరుకోండి. 07:00 గంటలకు నాశిక్ బస్సు స్టాండ్ లో మంచర్ వెళ్లే గవర్నమెంట్ బస్సు (ప్రైవేట్ బస్సు ఎక్కితే లేట్ అవుతుంది) ఎక్కి మంచర్ బస్సు స్టాండ్ లో 11:00 AM కి దిగండి (దూరం 150 KMs). మంచర్ బస్టాండ్ లో భీమా శంకర్ బస్సు ఎక్కి భీమశంకర్ (61KMs, 2hours) లో భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని [4] దర్శించుకొండి (బస్సు స్టాండ్ దెగ్గర లో నే గుడి వున్నది). మధ్యాహ్నం 2:00 PM కి భీమశంకర్ బస్టాండ్ లో పూణే  బస్సు ఎక్కి పూణే (PUNE) రైల్వే స్టేషన్ కి చేరుకొండి (110 KMs, 3 hours). రాత్రి 7:50PM కి ట్రైన్# 11090 పూణే భగత్ కి కోతి ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి. ఒక వేళారోజు గురువారం ఐతే డైరెక్ట్ సోమనాథ్ ట్రైన్ రాత్రి 7:50 PM ట్రైన్# 11088 పూణే వెరావల్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.
5 వ రోజు: అహ్మదాబాద్ (ADI) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:45AM కి దిగి ట్రైన్# 11464 జబల్పూర్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 8:15AM కి లేదా ట్రైన్#19119 అహ్మదాబాద్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 10:40 AM ఎక్కి వెరావల్ (VRL) రైల్వే స్టేషన్ లో సాయంత్రం 5:35PM కి లేదా 7:30PM కి దిగండి. అక్కడ బల్క తీర్థ్ దర్శించి, ప్రభాస్ తీర్థ్ త్రివేణి సంగమం లో స్నానం చేసి సోమనాథ్ జ్యోతిర్లింగ[5] దర్శనం  చేసుకుని  ట్రైన్# 19251 సోమనాథ్ ఒక  ఎక్ష్ప్రెస్స్ వెరావల్  లో రాత్రి 11:10 కి ఎక్కండి.
6 వ రోజు: ద్వారకా (DWK) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:10 AM కి దిగి, ద్వారకాధీశ్ దర్శనం, నాగేశ్వర  జ్యోతిర్లింగ [6] దర్శనం చేసుకుని ట్రైన్# 19006 (సౌరాష్ట్ర మెయిల్) మధ్యాహ్నం 1:00 PM కి  ద్వారకా స్టేషన్ లో ఎక్కండి. { (optional) లేదా ఒక రోజు ద్వారకా లో నే ఉండి ద్వారకాధీశ్ గుడి, ఆది శంకరాచార్య మఠం, భేట ద్వారకా, భద్కేశ్వర్ మహాదేవ్ గుడి, గోపి తలాబ్, గోమతి నది దర్శించండి.}
7 వ రోజు: వడోదర (BRC) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:48 AM కి దిగి, ట్రైన్# 12961 అవంతిక ఎక్ష్ప్రెస్స్ రాత్రి 1:10 AM కి ఎక్కండి. లేదా వడోదర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.
{8 వ రోజు: వడోదర రైల్వే స్టేషన్ నుంచి 61KMs దూరం లో సముద్రం లో వున్న స్తంభేశ్వర్ మహాదేవ్ గుడికి వేళ్ళగలరు. రాత్రి 9:50 PM కి ట్రైన్# 19309 GNC ఇండోర్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.}
9 వ రోజు: ఉజ్జయిని (UJN) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:20 AM లేదా 4:00 AM కి దిగి శిప్రా నది లో స్నానం చేసి మహాకాళేశ్వర జ్యోతిర్లింగ[7] దర్శనం చేసుకున్న తరువాత లోకల్ సైట్ సీఇంగ్ బస్సు ఎక్కండి. అక్కడ వున్న అమ్మ వారి శక్తిపీఠాన్ని దర్శించు కొండి. తరువాత ఓంకారేశ్వర  (135 kms) బస్సు ఎక్కి, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ[8] దర్శనం చేసుకోండి. పక్కనే వున్న స్వామి గజానన ఆశ్రమం లో రూమ్ తీసుకోండి.
10 వ రోజు: పొద్దున్నే నర్మదా నది లో స్నానం చేసి మళ్ళి వీలయితే ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి ఖండ్వా (70KMs) బస్సు ఎక్కి ఖండ్వా (KNW) రైల్వే స్టేషన్ కి ప్రొద్దున్న 10:00 AM లోపల చేరుకొండి. అక్కడ ట్రైన్# 11093 మహానగర ఎక్ష్ప్రెస్స్ లేదా ట్రైన్# 12167 లోకమాన్య తిలక్  టెర్మినస్ వారణాసి సూపర్ ఎక్ష్ప్రెస్స్ ప్రొద్దున్న 10:00AM కి ఎక్కండి.
11 వ రోజు: వారణాసి (కాశి) (BSB) రైల్వే స్టేషన్ కి పొద్దున్న 3:45 AM కి చేరుకొండి. కాశి లో గోదోలియా చౌక్ దెగ్గర రూమ్ లేదా డార్మిటరీ తీస్కొని ఫ్రెష్ అప్ ఐ కాశి విశ్వేశ్వర జ్యోతిర్లింగ[9] దర్శనం చేసుకోండి, తరువాత  కాశి విశాలాక్షి శక్తిపీఠ దర్శనం చేసుకోండి, తరువాత తిల్ బండేశ్వర్ శివ లింగాన్ని (బెంగాలీ తొల దెగ్గర వుంది) దర్శించుకోండి  (ఈ శివ లింగాన్ని దర్శించిన వారు కాశీ లో అన్ని శివ లింగాలు దర్శించినట్టే), కాల భైరవుని కూడా దర్శించుకోండి. ముఖ్యమైనది మధ్యాహ్నం 12:00 నుంచి 12:10 వరకు మణికర్ణికా ఘాట్ లో సంకల్పం చెప్పుకుని స్నానం చెయ్యాలి. ఆ సమయం లో స్నానం చేస్తే  లోకం లో వున్న సకల నదులలో స్నానం చేసిన దాని కంటే ఉత్తమం (చాగంటి కోటేశ్వర్ రావు గారి ప్రవచనం). రామేశ్వరం లోని శివ లింగానికి అభిషేకం కొరకు వేరుగా ఒక పాత్ర లో గంగ జలం తీసుకో గలరు. సాయంత్రం 5:00 PM కి సికింద్రాబాద్ (SC) రైల్వే స్టేషన్ వెళ్ళుటకు ట్రైన్# 12792 సికింద్రాబాద్  ఎక్ష్ప్రెస్స్ వారణాసి రైల్వే స్టేషన్ ఎక్కండి  లేదా  విజయవాడ  వెళ్ళుటకు  ట్రైన్# 12296 సంఘ మిత్ర  ఎక్ష్ప్రెస్స్ ముఘల్  సారాయి (MGS) రైల్వే స్టేషన్ లో రాత్రి 11:27PM కి ఎక్కండి. మీరు ప్రయాగ లో స్నానం చేయ్యాలంటే వారణాసి నుండి ప్రయాగ (రైలు లో ప్రయాణ సమయం  3:30 గంటలు) ముందుగా వేరే రైలు లో చేరుకొని అలాహాబాద్ (MGS) రైల్వే స్టేషన్ (ALD) (ప్రయాగ) లో స్నానం చేసి రాత్రి 8:40 కి హైదరాబాద్  వెళ్లే train#12792 సికింద్రాబాద్ ఎక్ష్ప్రెస్స్ అలాహాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్కగలరు.
12 వ రోజు: సికింద్రాబాద్ కి రాత్రి 10:00 PM కి చేరుకొండి లేదా విజయవాడ కి ప్రొద్దున్న 6:05 AM కి చేరుకొండి

Thursday, July 30, 2020

సర్వసంపదలిచ్చే శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్త్వస్వరూపే చ కోపాది పరి వర్జితే||
ఉపమే సత్త్వసాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యం చ నిష్ఫలమ్|
సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణీ|
రామేశ్వర్యధిదేవీ త్వం త్వత్కళాసర్వయోషితః||
కైలాసే పార్వతీ త్వం చ క్షీరోధే సింధుకన్యకా|
స్వర్గే చ స్వర్గ లక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే||
వైకుంఠే చ మహాలక్ష్మీ ర్దేవదేవీ సరస్వతీ|
గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా||
కృష్ణప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికాస్వయమ్|
రాసేరాసేశ్వరీ త్వం చ వృందా వృందావనే  వనే||
కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందనకాననే|
విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ|
పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే|
కుందదంతా కుందవనే సుశీలా కేతకీవనే||
కదంబమాలా త్వం దేవీ కదంబ కాననేపి చ|
రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీః గృహే గృహే||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వే మునయో మనవస్తథా|
రురుద్దుర్నమ్ర వదనా శుష్క కంఠో తాలుకాః||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
హత బంధుర్లభేద్బంధుః ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||

ఇది మహాలక్ష్మీ స్తోత్రం. మహాప్రభవ సంపన్న మైన స్తోత్రం. దేవత లంతా కలసి ఆ జగజ్జ ననిని స్తోత్రించిన మహా వాక్యాలివి. శ్రీ

మహాలక్ష్మి సంపద లకి శ్రే ష్ఠ త్వానికి, కాం తి కీ ,
 ఇది ముఖ్యంగా పురుషులకు ఉత్తమమైంది స్త్రీలకు ఎట్లాగో అన్ని స్తోత్రాలు ఉన్నాయి

ఇది వివాహం కాకపోయినా ఉద్యోగం రాకపోయినా ఈ అందరూ చదువుకునేది రోజు 41 రోజులు కలవాలి నైవేద్యం పెట్టాలి పాయసం దీని విశేషమైంది దీనికి నియమాలేవీ లేవు

***********

వరలక్ష్మి వ్రతానికి

వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామగ్రి :-



పసుపు 100 గ్రాములు



కుంకుమ100 గ్రాములు.



ఒక డబ్బ గంధం



విడిపూలు,పూల దండలు - 6



తమల పాకులు -30 వక్కలు



వంద గ్రాముల ఖర్జూరములు



50 గ్రాముల అగరవత్తులు



కర్పూరము - 50 గ్రాములు



౩౦ రూపాయి నాణాలు



ఒక తెల్ల టవల్



జాకెట్ ముక్కలు



మామిడి ఆకులు



ఒక డజన్ అరటిపండ్లు



ఇతర ఐదు రకాల పండ్లు



అమ్మవారి ఫోటో



కలశం



కొబ్బరి కాయలు



తెల్లదారము లేదా పసుపు రాసిన కంకణం 2



స్వీట్లు



బియ్యం 2 కిలోలు



కొద్దిగా పంచామృతం లేదా ఆవుపాలు



దీపాలు



గంట



హారతి ప్లేటు



స్పూన్స్



ట్రేలు



ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనే, వత్తులు



అగ్గిపెట్టె



గ్లాసులు



బౌల్స్

వ్రత విధానం :-



వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి.



కావలసినవి :-



పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు,కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం,శనగలు మొదలైనవి.



కంకణం ఎలా తయారుచేసుకోవాలి :-



తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి,కంకణాన్ని పూజించి ఉంచుకోవాలి.ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.



గణపతి పూజ:-



అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే



వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ



నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥



ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన



పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥



గణపతిపై అక్షతలు చల్లాలి.



యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.



ఓం సుముఖాయ నమః ,



ఓం ఏకదంతాయ నమః ,



ఓం కపిలాయ నమః ,



ఓం గజకర్ణికాయ నమః ,



ఓంలంబోదరాయ నమః ,



ఓం వికటాయ నమః,



ఓం విఘ్నరాజాయ నమః,



ఓం గణాధిపాయ నమః,



ఓంధూమకేతవే నమః,



ఓం వక్రతుండాయ నమః,



ఓం గణాధ్యక్షాయ నమః,



ఓం ఫాలచంద్రాయ నమః,



ఓం గజాననాయ నమః,



ఓం శూర్పకర్ణాయ నమః,



ఓం హేరంబాయ నమః,



ఓం స్కందపూర్వజాయనమః,



ఓం శ్రీ మహాగణాధిపతయే నమః



నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.



ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి



ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.



స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.



ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,



భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!



నీటిని నివేదన చుట్టూ జల్లుతూ ... సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి).



ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!



వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.



కలశపూజ :-



కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః



మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః



కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా



ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః



అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః



ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.



అధాంగపూజ:-



పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.



చంచలాయై నమః - పాదౌ పూజయామి,



చపలాయై నమః - జానునీ పూజయామి,



పీతాంబరాయైనమః - ఉరుం పూజయామి,



మలవాసిన్యైనమః - కటిం పూజయామి,



పద్మాలయాయైనమః -నాభిం పూజయామి,



మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి,



కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి,



సుముఖాయైనమః - ముఖంపూజయామి,



సునేత్రాయైనమః - నేత్రౌపూజయామి,



రమాయైనమః - కర్ణౌ పూజయామి,



కమలాయైనమః - శిరః పూజయామి,



శ్రీవరలక్ష్య్మైనమః - సర్వాణ్యంగాని పూజయామి.



(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి)



శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-



ఓం ప్రకృత్యై నమః



ఓం వికృతై నమః



ఓం విద్యాయై నమః



ఓం సర్వభూత హితప్రదాయై నమః



ఓం శ్రద్ధాయై నమః



ఓం విభూత్యై నమః



ఓం సురభ్యై నమః



ఓంపరమాత్మికాయై నమః



ఓం వాచ్యై నమః



ఓం పద్మాలయాయై నమః



ఓం శుచయే నమః



ఓంస్వాహాయై నమః



ఓం స్వధాయై నమః



ఓం సుధాయై నమః



ఓం ధన్యాయై నమః



ఓంహిరణ్మయై నమః



ఓం లక్ష్మ్యై నమః



ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యైనమః



ఓం ఆదిత్యై నమః



ఓం దిత్యై నమః



ఓం దీప్తాయై నమః



ఓం రమాయై నమః



ఓం వసుధాయై నమః



ఓం వసుధారిణై నమః



ఓం కమలాయై నమః



ఓం కాంతాయై నమః



ఓంకామాక్ష్యై నమః



ఓం క్రోధ సంభవాయై నమః



ఓం అనుగ్రహ ప్రదాయై నమః



ఓంబుద్ధ్యె నమః



ఓం అనఘాయై నమః



ఓం హరివల్లభాయై నమః



ఓం అశోకాయై నమః



ఓంఅమృతాయై నమః



ఓం దీపాయై నమః



ఓం తుష్టయే నమః



ఓం విష్ణుపత్న్యై నమః



ఓంలోకశోకవినాశిన్యై నమః



ఓం ధర్మనిలయాయై నమః



ఓం కరుణాయై నమః



ఓంలోకమాత్రే నమః



ఓం పద్మప్రియాయై నమః



ఓం పద్మహస్తాయై నమః



ఓంపద్మాక్ష్యై నమః



ఓం పద్మసుందర్యై నమః



ఓం పద్మోద్భవాయై నమః



ఓంపద్మముఖియై నమః



ఓం పద్మనాభప్రియాయై నమః



ఓం రమాయై నమః



ఓంపద్మమాలాధరాయై నమః



ఓం దేవ్యై నమః



ఓం పద్మిన్యై నమః



ఓం పద్మ గంధిన్యైనమః



ఓం పుణ్యగంధాయై నమః



ఓం సుప్రసన్నాయై నమః



ఓం ప్రసాదాభిముఖీయైనమః



ఓం ప్రభాయై నమః



ఓం చంద్రవదనాయై నమః



ఓం చంద్రాయై నమః



ఓంచంద్రసహోదర్యై నమః



ఓం చతుర్భుజాయై నమః



ఓం చంద్ర రూపాయై నమః



ఓంఇందిరాయై నమః



ఓం ఇందుశీతలాయై నమః



ఓం ఆహ్లాదజనన్యై నమః



ఓం పుష్ట్యెనమః



ఓం శివాయై నమః



ఓం శివకర్యై నమః



ఓం సత్యై నమః



ఓం విమలాయై నమః



ఓం విశ్వజనన్యై నమః



ఓం దారిద్ర నాశిన్యై నమః



ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః



ఓం శాంత్యై నమః



ఓం శుక్లమాలాంబరాయై నమః



ఓం శ్రీయై నమః



ఓంభాస్కర్యై నమః



ఓం బిల్వ నిలయాయై నమః



ఓం వరారోహాయై నమః



ఓం యశస్విన్యైనమః



ఓం వసుంధరాయై నమః



ఓం ఉదారాంగాయై నమః



ఓం హరిణ్యై నమః



ఓంహేమమాలిన్యై నమః



ఓం ధనధాన్యకర్యై నమః



ఓం సిద్ధ్యై నమః



ఓం త్రైణసౌమ్యాయై నమః



ఓం శుభప్రదాయై నమః



ఓం నృపవేశగతానందాయై నమః



ఓంవరలక్ష్మ్యై నమః



ఓం వసుప్రదాయై నమః



ఓం శుభాయై నమః



ఓంహిరణ్యప్రాకారాయై నమః



ఓం సముద్రతనయాయై నమః



ఓం జయాయై నమః



ఓంమంగళాదేవ్యై నమః



ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః



ఓం ప్రసన్నాక్ష్యైనమః



ఓం నారాయణసీమాశ్రితాయై నమః



ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః



ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః



ఓం నవదుర్గాయై నమః



ఓం మహాకాళ్యై నమః



ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః



ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః



ఓంభువనేశ్వర్యై నమః



కంకణపూజ :-



కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.



కమలాయైనమః - ప్రథమగ్రంథిం పూజయామి,



రమాయైనమః - ద్వితీయ గ్రంథింపూజయామి,



లోకమాత్రేనమః - తృతీయ గ్రంథింపూజయామి,



విశ్వజనన్యైనమః - చతుర్థగ్రంథింపూజయామి,



మహాలక్ష్మ్యై నమః - పంచమగ్రంథిం పూజయామి,



క్షీరాబ్ది తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి,



విశ్వసాక్షిణ్యై నమః - సప్తమగ్రంథిం పూజయామి,



చంద్రసోదర్యైనమః - అష్టమగ్రంథిం పూజయామి,



శ్రీ వరలక్ష్మీయై నమః - నవమగ్రంథిం పూజయామి.



ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి



బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం



పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే



వ్రత.



కథా ప్రారంభం :-



శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి.



పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు.



ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం.దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.



అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.



వరలక్ష్మీ సాక్షాత్కారం :-



వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. "హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.



అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు.



చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో



సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే



శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.



అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.



మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జేలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి.మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వా భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు.



వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.



వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు.



మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలిగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి,రాత్రి ఉపవాసం ఉండాలి.



భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి.సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 'వర' అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.

Saturday, March 28, 2020

BURNING TREATMENT (IS THIS HELPFUL TO CURE CARONA)


INDIAN OLD TRADITIONAL BURNING TREATMENT (IS THIS HELPFUL TO CURE CARONA)

Here I would like to describe the treatment in our village people used to do about 70, 80 years ago, when there was no development of medical facilities in the villages.  This treatment is called PUTTING VAATHALU means burning the body of a patient with small needle.  If the patient body is burn with small needle he used get relief of the fever or whatever the unknown disease he suffered.  I thought it was a uncultured treatment.  But now when I enlisted I realized science behind that.  Whether I am correct or not only doctor  should say.  Because I am not a Doctor by profession.  I am a science student up to degree level.  With my little medical knowledge I try to describe the theory.

MY ANALYSIS:
If our body is burnt to a small portion immediately our immune system reacts and it produces anti bodies to cure the burning injury.  As the patient is suffering with some incurable disease whatsoever, the anti bodies generated in the body will fight with the unknown germs which are persisting in the body and which are responsible for the ailment. Which kills the unknown germs and cures the patient.
If I am correct the system defiantly cure the PANDEMIC CARONA virus.  If really this system works we can save the lives of many people. 

HOW TO TREAT HEAT TREATMENT WITH NEADLES:
I am describing the system which I heard from our parents.
1) Take a small needle like needle used to stitch cloths.  Better to see that needle should be hygienic. Heat the needle on burner or electric stove for few seconds.  When the needle heats up put the needle on the belly of the patient this is called VATHA in our language (Telugu) repeat the same thrice if you think that the patient is having severity do for four times.  The maximum VATHA should be three or four.  Leave the patient for some time.  He will suffer with the burns.  You can apply antiseptic cream or ointment on the burns. We can treat the burn injuries with ointments, let the patient relax.  After a day or two I believe the patient will be cured with virus disease.  But it may take some days to relive from the pain of the burned injuries.    I definitely believe this will work.  I pray the god to cure this PANDEMIC CORONA and save the mankind.

CONCLUSION: I request my readers that the above system may or may not work.  Just we are taking a chance.  If the treatment works we can save lives.  If not by this treatment no patient will die only he have to suffer the pain of injuries only. 

DISCLAIMER: this article is written with a good concept of help the mankind.  The author is not having any bad or evil intention to cause injuries to any person/s.  if anybody suffer any pain, damage due to implementation of this treatment is exclusively with the personal risk of the person following the above method.  This blogger or the bold does not held any type of responsibility.  Please note.

LOSTLY: I pray god to save the patients suffering from this PANDEMIC CORONA VIRUS DISEASE. If god uses me as an instrument to cure the disease ( by adopting the above method) I will be very, very grateful to the almighty, the creator.

HOPE: I firmly having hope on the god I believe that he will certainly give solution to cure the  PANDEMIC CORONA VIRUS DISEASE in an early date and saves the innocent peoples.

BE OPTIMISTIC EVERY THING WILL BE SOLVED



Sunday, December 22, 2019

ఆకాంక్ష


హై భగవాన్  
నీవు విద్యుత్ కాంతి ప్రతిఘటనా  జ్యోతివి 
నేనొక తైలనువుని  
నా తనువొక పత్తి ప్రోగు 
నా తానువాదారంగా  బ్రతుకుతున్నాను 
నిన్ను చేరాలని ఆకాంషిస్తున్నాను 
నాపై దయతో నీ దరికి నివ్వే చేర్చుకో 
నీ అప్రతిక దీప్తిలో  నన్ను లిప్త కాలం  ఉండనీ 
ఇదే నా ఆకాంక్ష 
విధించకు ఈ జీవితపు ఆంక్ష  

నిర్ధేశించు
 హృదయంలో ఉంటే నిన్ను మేము ఆలయంలో వెతుకుతామే 
మనసుతో తెలుసుకోవలసిన నిన్ను పూలతో పూజిస్తామే
ఆత్మను సమర్పించకుండా మేము
ప్రసాదాలను నివేదిస్తామే
ప్రభు
మా అజ్ఞానాన్ని రూపు మాపు
జ్ఞాన జ్యోతిని వెలిగించు
నీ ప్రకాశం వైపు మా పయనాన్ని నిర్ధేశించు

1996 వ సం.  అద్వయిత పరంగా చేసిన రచన

దేముడు

 దేముడు అనగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెపుతుంటారు.  దానికి కారణం ఎవరు ఏమి చెప్పినా అన్ని కూడా దేముడే కాబట్టి.  " మహర్షి మతయచ్ఛ బిన్నాహా " అనే నానుడి ననుసరించి మేధావులైన వారు వారి అనుభవంతో గాంచిన దానిని వక్కాణిస్తూ వుంటారు. కాబట్టి దేనిని మనం కాదనలేము.  కానీ ప్రతిదానిని పరిశీలించి చూసినప్పుడు మాత్రమే మనకు యదార్ధం గోచరమవుతుంది.  

 దేముడి లక్షణాలు ఏమిటి 
దేముడు నామ (పేరు) రూప (ఆకారం) గుణ (లక్షణం) లేని వాడు.  అంతే కాక కాలంలో లేని వాడు (శాస్వితుడు).  ఇప్పుడు ఈ విషయాన్నీ కూలంకుషంగా చూద్దాము. 
మనం చుసే ఈ చెరా చెర జగత్తులో మనకు ఒకటి గోచరిస్తూ వున్నది అదే మనకు కనబడే ప్రతి దానికి ఒక నిర్దుష్టమైన రూపం ఉండటమే . కాబట్టి  మనం ప్రతిదానిని చూసి గుర్తుంచుకోగలుగుతున్నాం.  మనం గుర్తుంచుకోటానికి ప్రతి దానికి ఒక పేరు ఇస్తున్నాము.  మనకు ప్రత్యక్షముగా ఏది తెలియకపోయిన ఒక పేరుతొ ఒక వస్తువును గుర్తు పట్టగలుగుతున్నాము. మనం చూస్తున్నాము కాబట్టి అది మనకు గోచరిస్తుంది.  దానినే ప్రత్యక్షము అంటాము. మన ప్రత్యేక్ష జ్ఞ్యానం కలిగినది ప్రతిదీ వికారం చెందేది అంటే మార్పు చెందేది.  మార్పు మూడు రకాలు  1)జననం (ఆది) అంటే మనం చూసే ప్రతి వస్తువే కానీ మనిషే కానీ కాక ఏ ఇతర జంతువే కానీ ఏదో ఒక రోజు జన్మించి వున్నదే. 
 2) వికారం(మధ్య) అంటే మనం చూసే ఈ దృశ్యమాన జగత్తు అంతా మార్పు చెందుతూ వున్నది.  నిన్న చూసింది నేడు లేదు.  అంటే నిన్న చూసిన్ది మనకు ఈ రోజు కుడా కనపడుతున్నది కానీ ఎంతో కొంత మార్పు చెంది కనబడుతున్నది. నిన్న మనకువిత్తనంగా గోచరించింది భూమిలో నాట గానే రెండు మూడు రోజులలో మొలకగా కనబడుతున్నది.  తరువాత చెట్టుగా లతగా పెరగటం చూస్తున్నాం. ఈ పెరుగుదల ఒక్క మొక్కలకే కాదు అన్ని ప్రాణులలో చూస్తున్నాం. మరి నిర్జీవుల విషయంలో వాటి రూపాలు కాలాంతరంలో మారటం చూస్తున్నాము.  కొన్ని త్వరగా మార్పు చెందవచ్చు కొన్ని ఆలస్యంగా మార్పు చెందవచ్చు. కానీ మార్పు చెందటం మాత్రం సత్యం. 
3) మరణం (అంతం.) మార్పు చెందిన ప్రతిదీ నశించిపోవటం చూస్తున్నాం ఇదే అంతం. జీవులు ప్రాణాలని కోల్పోయి మరణిస్తున్నాయి.  మరణానంతరం జీవ రహిత శరీరాలు పంచ భూతాలలో కలసి పోతున్నాయి. నిర్జీవులు నిత్యం ప్రకృతిలో అనేక రసాయనిక చర్యలు చెంది వాటి ఉనికి కోల్పోయి పంచభూతాలలో ఐక్యం అవుతున్నాయి.  ఉదా :  మనం ఒక కారు చూసాం అది కొంత కాలం కారు రూపంలో వుంది పయనిస్తూ ఉంటుంది.  తరువాత దాని యంత్ర సామాగ్రి అంతా  చెడిపోయి దాని లక్షణాన్ని (నడిచే స్వభావం) కోల్పోతుంది. చివరికి పూర్తిగా తుప్పు పట్టి రూపాన్ని కుడా కోల్పోతుంది ఈ ప్రక్రియ జరగటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ నశించక మాత్రం ఉండదు.  మనం చూసే ఈ దృశ్యమాన జగత్ మొత్తము నశించేదే "ఎత్ దృశ్యం తత్ నశ్యం "  కనబడేది ప్రతిదీ ఏదో ఒక రోజు నశించి పోయేదే. దీన్ని బట్టి మనకు గోచరించేది ఏమిటంటే ఈ జగత్తు శాశ్వితము  కాదు అని. 
దేముడి స్వభావం:  మనం ఈ జగత్తును పరిశీలిస్తే అది మనకు ఆది, మధ్య, అంతాలతో గోచరిస్తూ వున్నది.  మనం ముందే చెప్పుకున్నాం దేముడు ఆది మధ్య అంత రహితుడు అని.  కాబట్టి దేముడు మనకు కనపడడు  ఎందుకంటే కనపడేవి అన్ని కూడా ఫై మూడు లక్షణాలు కలిగినవి.  ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు లేవో అట్టి దేముడు మనకు కనపడటానికి ఆస్కారం లేదు.  దేముడు కనపడితే, దేముడే కాదు. 
ఇతిహాసాలు పరిశిలిస్తే మనకు ఒక విషయం గోచరిస్తుంది.  అది ఇక్కడ తెలుసుకొందాము.  రామాయణంలో మనకు రావణబ్రహ్మ గారు తప్పస్సు చేస్తే పరమ శివుడు ప్రత్యక్షమయి వరాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.  ఇది త్రేతాయుగం.  ఆ తరువాత ద్వాపర యుగంలో భారతంలో పాండవ మధ్యముడు ఐన అర్జనులవారు ఇంద్రకీలాద్రి మీద తప్పస్సు చేస్తే పరమ శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రం బహుకరించినట్లు చదువు కున్నాము.  ఇప్పుడు మనము విశ్లేషణ చేస్తే అక్కడ త్రేతాయుగంలో రావణ బ్రహ్మ గారికి ప్రత్యక్ష మైన పరమ శివుడు ఇప్పుడు ద్వాపర యుగంలో అర్జనుల వారికీ ప్రత్యక్షము ఐనా పరమ శివుడు ఒక్కరే. త్రేతా యుగంలో రావణ బ్రహ్మ గారు గతించారు ద్వాపర యుగంలో అర్జనుల వారు గతించారు.  కానీ పరమ శివుడు ఆ రెండు కాలాల్లో ప్రత్యక్షము అయినట్లు మనకు ఇతిహాసాలు చెపుతున్నాయి. ఇప్పుడు మనం కూడా అచంచల దీక్షతో తప్పస్సు చేస్తే ఆ పరమ శివుడు మనకు కూడా ప్రత్యక్షము కాగలరు.   దీనిని బట్టి మనకు ఒక విషయము బోధ పడుతుంది. అదే ఏమిటంటే ఆ పరమ శివుడు కాలంలో లేరని ఆ దేముడు కాలాతీతుడని.  కాలాతీతుడు ఐన దేముడు మరి ఎలా ప్రత్యక్షం అవుతాడు.  ఇప్పుడు ప్రత్యక్షం అంటే ఏమిటో తెలుసుకుందాము. 
ప్రత్యక్షం: అంటే ఏదైనా మనము చూడటముని ప్రత్యక్షం అని మనం అనుకుంటాము.  కానీ ప్రత్యక్షం అనే పదానికి అర్ధం ఏదైతే మన ఇంద్రియాలకు గోచరం అవుతుంతో అది ప్రత్యక్షం.  మన పంచేద్రియాలకు తెలుస్తుందో అది ప్రత్యక్షం.  ఈ జగత్తులో మనకు కనిపించనిది  ఒక కారణం చేత కనిపించుటే ప్రత్యక్షం.  ఆ దేవదేవుడు సర్వ కాల సర్వావస్థలలో ఉండి ఉండి కేవలము తన భక్తులకు తాత్కాలికంగా గోచరించటమే ప్రత్యక్షం.  కాబట్టి దేముడు కాలంలో లేడు.  కాలమే తనలో వున్నది.  
ద్వయిత ప్రపంచం : అంటే మనం చూస్తున్న ఈ ప్రపంచం మొత్తం తనకన్నా భిన్నంగా గోచరిస్తుంది.  ఈలా వున్నదానిని ద్వైత జగత్తు అంటారు.  అంటే ఇందులో నేను కానిది వున్నది.  అంటే నేను వేరు ఈ ప్రపంచం వేరు.  ఇలా రెండు రకాలుగా కనబడుతున్నది.  అంతే కాక మనకు ఇక్కడ ప్రతిదీ రెండుగా గోచరిస్తుంది. అది లింగ భేదం. రూప బేధం. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ప్రత్యకత కలిగి వుంది ఏ రెండు కూడా పూర్తిగా సారూప్యంగా మనకు కనపడవు.  కొన్ని స్థూలంగా ఒక్క రకంగా వున్నా మనం సూక్ష్మంగా పరీక్షిస్తే ఒకదానికి ఒకటి భిన్నంగా కనబడతాయి. ఇలాంటి ద్వయత జగత్తు నుండి విడివాడటమే మోక్షం.  అదే అద్వయితం బోధిస్తుంది. 
నాస్తిక వాదం : నాస్తికులు దేముడు లేడు అని వాదిస్తున్నారు.  వారికి ఒక సూటి ప్రశ్న.  మనం రోజు చూసే జంతువే కానీ లేక మనిషీ కానీయండి మరణించిన కొద్దీ కాలానికే క్రుళ్లటం (decompose) కావటం చూస్తున్నాము.  కొన్ని బ్యాక్టీరియాలు ఆ శరీర అవయవాలు తినటం వలన ఆ కళేబరం క్రుళ్ళు తున్నది అని సైన్సు చెపుతున్నది.  అది నిజమైతే మరి ఆ జంతువు లేక మనిషి జీవించి వున్నప్పుడు క్రుళ్ల కుండా కాపాడుతున్నది ఎవరు?  ఈ ప్ర్రశ్నకి సరైన సమాధానం ఎవరు చెప్పుతారు. ఇది మన శాస్త్రానికి అంతు చిక్కని ప్రశ్న. జీవి బ్రతికి ఉండటానికి ప్రాణం కారణం అని అంటున్నారు.  ఐతే మరి ఆ ప్రాణం ఏమిటి.  మనకు కనపడదు ఎందుకు. కనపడని దానిని నమ్మటం ఎందుకు?.  సరే నమ్ముదామంటే దానికి ప్రమాణం ఏమిటి.  ఏదైనా ఒక పని జరగాలంటే ఆ పని చేసే వాడు ఉండాలి.  ఆ పని ఆ చేసేవాడి నైపుణ్యం మీద మాత్రమే జరుగుతుంది.  ఒక భవనం నిర్మించాలంటే భావన నిర్మాణ ఇంజనీరు మాత్రమే పని చేయాలి.  అదే ఒక యంత్రం నిర్మించాలంటే యంత్ర నిర్మాణ ఇంజినీర్ వల్లనే సాధ్యం అవుతుంది.  అలానే ఒక రుచికరమైన ఆహార పదార్ధం వండాలంటే వంట చేయగల వంట వాని వల్లనే సాధ్యం అవుతుంది.  ఈ రీతిగా ఒక్కొక్క పని చేయాలంటే ఆ పనిలో ప్రావిణ్యం వున్నవారు మాత్రమే చేయగలరు.  ఒక పని చూసిన వానికి ఆ పని చేసిన వాడు కనపడవచ్చు లేక కనపడక పోవచ్చు కానీ ఆ పని మాత్రం కనపడుతున్నది.  ఏప్పుడో వందల సమస్తరాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఇప్పడికీ మనకు గోచరిస్తూ వున్నాయి నిజానికి ఆ కళాఖండాలను నిర్మించిన కళాకారులు ఎవరో మనకు తెలియదు.  వాళ్ళ పని (work) మాత్రం మనకు కనపడుతున్నది.  దీనిని బట్టి మనం తప్పకుండ నమ్మ వలసిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే పని వున్నదో అప్పుడు పని చేసిన వాడు కుడా ఉంటాడు. ఆ పనివాడు వున్నాడని నిరుపనే అతను చేసిన పని.  కాబట్టి నియతి మనకు గోచరిస్తుంది కాన నియంత వుండివుండాలి.  మనముందు వున్న ఈ దృక్ గోచరాన్ని నమ్మక పోవటం కేవలం అవివేకం మాత్రమే అవుతుంది.   


ఇంకా వుంది  

Wednesday, November 28, 2018

Shri Ramayana Express

Indian Railways has announced a special tourist train 'Shri Ramayana Express', covering all places from Ayodhya to Colombo via Rameshwaram, tweeted Piyush Goyal, Minister of Railways and Coal from his official handle- @PiyushGoyal. Indian Railways all-new 'Shri Ramayana Express'  will start from November 14, 2018 from Delhi and will take 16 days to cover the Ramayana circuit. The trip will be operated by IRCTC (Indian Railway Catering and Tourism Corporation), the bookings of which have already opened on IRCTC Tourism official website- irctctourism.com. The entire trip will be priced at Rs. 15,120.
Here are key things to know about Indian Railways' 'Shri Ramayana Express':
1. IRCTC offers to run 'Shri Ramayana Express' special Tourist train on Ramayana circuit covering the prominent sacred places associated with the life of Lord Rama. An add-on tour is also designed to visit the places of Ramayana located in Srilanka, said IRCTC Tourism.
2. The 'Sri Ramayana Express' train service will start from Safdarjung railway station in Delhi and make its first stop in Ayodhya.
3.  En-route, Sri Ramayana Express will halt at Nandigram, Sitamarhi, Janakpur, Varanasi, Prayag, Shringaverpur, Chitrakoot, Hampi, Nasik and Rameshwaram.
4.  Passengers can choose to travel to Colombo, the capital of Sri Lanka from Chennai by flight also, as tweeted  by Piyush Goyal.
5. There are 800 seats up for grabs on the train. 
6. The bookings for the trip will be done in standard category only.
7. The package will include travel, accommodation, food and sight-seeing arrangements also, tweeted Piyush Goyal.
8.  Tour manager will be accompanying the passengers during the trip, tweeted Piyush Goyal.



Monday, November 5, 2018

Guru's feet

Guru's feet is a very good site every spiritual minded person should visit.  it is the place of many spiritual thoughts and Gurus.  one must see.  Go to the following link

https://www.gurusfeet.com/online-universal-temple 

Tuesday, October 23, 2018

Brahma Kumaris



General information:
Brahma Kumaris is a worldwide spiritual movement dedicated to personal transformation and world renewal. Founded in India in 1937, Brahma  Kumaris has spread to over 110 countries on all continents and has had an extensive impact in many sectors as an international NGO. However, their real commitment is to helping individuals transform their perspective of the world from material to spiritual. It supports the cultivation of a deep collective consciousness of peace and of the individual dignity of each soul.
To know more about Brahma Kumaries plz visit the following link and enter in the world of meditation and be free from all your mental disturbances and have peace of life and path of life.

http://www.brahmakumaris.org/