Friday, March 23, 2012

రాగి విరాగి 
ప్రతి మనిషి తాను సుఖంగా, ఆనందంగా వుండాలని భావిస్తాడు. ప్రస్తుతం వున్నా స్థితి కన్నా ఇంకా మెరుగుగా సుఖపడాలని ఆనందపడాలని కోరుకోవటం సహజం.  తాను ఈ ప్రపంచంలో దొరికే ఆనందాల వైపు పరుగులు తీస్తాడు ఈ జీవితంలో తాను సుఖ పడటానికి  ఇంకా ఏమి లేదు అన్నప్పుడు ఇంకా ఏదో వుండాలి అన్న ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే పూర్ణత్వం వైపు నడిపిస్తుంది.  అదే వేదాంతపు మొదటి మెట్టు వేదాంతం నుంచేవైరాగ్యం పుడుతుంది.  వైరాగ్యం  ఆ ఫై స్థితి  బ్రహ్మత్వపు దిశగా నడిపిస్తుంది.  బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి వక మంచి గురువు కావాలి.  మరి ఆ గురువును తెలుసుకోటం ఎలా ?  ప్రతి మనిషిని నిత్యం వేదిస్తున్న సమస్యేయిది.  వక మంచి సద్గురువు దొరకటం మన పూర్వ జన్మ సుకృతము.  ఆలోచన వుంటే అవకాశము దొరుకుతుంది.  

ఈ రోజ్జుల్లో మనకు చాలామంది మేము జ్ఞ్యనులము బ్రహ్మర్షులము మీకు జ్ఞ్యన బోధ చేస్తాము.  మాకు ఈ ఫీజు కట్టండి ఆ కానుకలు సమర్పించండి అని ప్రకటనలను ఇస్తున్నారు.  మీరు వాళ్ళ వెంట వెళ్ళవద్దు నిజమైన గురువుకి వక్కటే పరీక్ష. 

  సద్గురువు ఎప్పటికి ఈ ఐహిక వాంఛలతో ఉండడు  తనకి ఏది ఇచ్చిన తిసుకోడు మీ నుండి ఏదో ఆశించి మీకు ప్రభోదచేయడు  కేవలము నిత్యం భ్రహ్మ్మంలోనే సంచరిస్తూ వుంట్టాడు ఈ ప్రపంచంలో  ఏది కూడా కోరాడు అన్ని తనకు  తృణ ప్రాయంగా తోస్తాయి.  ఈ బౌతిక సమాజాన్ని పట్టించుకోడు.  అవమాన, సన్మానాలను సమానంగా చూస్తాడు.  ఎవరిమీద వ్యామోహం కానీ, హేయం కానీ కలిగి ఉండడు.  అటువంటి గురువు లబించటం చాల అరుదు    మీకు అటువంటి గురువు తారస పడితే వెంటనే అతనికి పాదాభివందనం చెయ్యండి 

ఇంకా వుంది 

No comments: