Sunday, December 22, 2019

ఆకాంక్ష


హై భగవాన్  
నీవు విద్యుత్ కాంతి ప్రతిఘటనా  జ్యోతివి 
నేనొక తైలనువుని  
నా తనువొక పత్తి ప్రోగు 
నా తానువాదారంగా  బ్రతుకుతున్నాను 
నిన్ను చేరాలని ఆకాంషిస్తున్నాను 
నాపై దయతో నీ దరికి నివ్వే చేర్చుకో 
నీ అప్రతిక దీప్తిలో  నన్ను లిప్త కాలం  ఉండనీ 
ఇదే నా ఆకాంక్ష 
విధించకు ఈ జీవితపు ఆంక్ష  

నిర్ధేశించు
 హృదయంలో ఉంటే నిన్ను మేము ఆలయంలో వెతుకుతామే 
మనసుతో తెలుసుకోవలసిన నిన్ను పూలతో పూజిస్తామే
ఆత్మను సమర్పించకుండా మేము
ప్రసాదాలను నివేదిస్తామే
ప్రభు
మా అజ్ఞానాన్ని రూపు మాపు
జ్ఞాన జ్యోతిని వెలిగించు
నీ ప్రకాశం వైపు మా పయనాన్ని నిర్ధేశించు

1996 వ సం.  అద్వయిత పరంగా చేసిన రచన

దేముడు

 దేముడు అనగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెపుతుంటారు.  దానికి కారణం ఎవరు ఏమి చెప్పినా అన్ని కూడా దేముడే కాబట్టి.  " మహర్షి మతయచ్ఛ బిన్నాహా " అనే నానుడి ననుసరించి మేధావులైన వారు వారి అనుభవంతో గాంచిన దానిని వక్కాణిస్తూ వుంటారు. కాబట్టి దేనిని మనం కాదనలేము.  కానీ ప్రతిదానిని పరిశీలించి చూసినప్పుడు మాత్రమే మనకు యదార్ధం గోచరమవుతుంది.  

 దేముడి లక్షణాలు ఏమిటి 
దేముడు నామ (పేరు) రూప (ఆకారం) గుణ (లక్షణం) లేని వాడు.  అంతే కాక కాలంలో లేని వాడు (శాస్వితుడు).  ఇప్పుడు ఈ విషయాన్నీ కూలంకుషంగా చూద్దాము. 
మనం చుసే ఈ చెరా చెర జగత్తులో మనకు ఒకటి గోచరిస్తూ వున్నది అదే మనకు కనబడే ప్రతి దానికి ఒక నిర్దుష్టమైన రూపం ఉండటమే . కాబట్టి  మనం ప్రతిదానిని చూసి గుర్తుంచుకోగలుగుతున్నాం.  మనం గుర్తుంచుకోటానికి ప్రతి దానికి ఒక పేరు ఇస్తున్నాము.  మనకు ప్రత్యక్షముగా ఏది తెలియకపోయిన ఒక పేరుతొ ఒక వస్తువును గుర్తు పట్టగలుగుతున్నాము. మనం చూస్తున్నాము కాబట్టి అది మనకు గోచరిస్తుంది.  దానినే ప్రత్యక్షము అంటాము. మన ప్రత్యేక్ష జ్ఞ్యానం కలిగినది ప్రతిదీ వికారం చెందేది అంటే మార్పు చెందేది.  మార్పు మూడు రకాలు  1)జననం (ఆది) అంటే మనం చూసే ప్రతి వస్తువే కానీ మనిషే కానీ కాక ఏ ఇతర జంతువే కానీ ఏదో ఒక రోజు జన్మించి వున్నదే. 
 2) వికారం(మధ్య) అంటే మనం చూసే ఈ దృశ్యమాన జగత్తు అంతా మార్పు చెందుతూ వున్నది.  నిన్న చూసింది నేడు లేదు.  అంటే నిన్న చూసిన్ది మనకు ఈ రోజు కుడా కనపడుతున్నది కానీ ఎంతో కొంత మార్పు చెంది కనబడుతున్నది. నిన్న మనకువిత్తనంగా గోచరించింది భూమిలో నాట గానే రెండు మూడు రోజులలో మొలకగా కనబడుతున్నది.  తరువాత చెట్టుగా లతగా పెరగటం చూస్తున్నాం. ఈ పెరుగుదల ఒక్క మొక్కలకే కాదు అన్ని ప్రాణులలో చూస్తున్నాం. మరి నిర్జీవుల విషయంలో వాటి రూపాలు కాలాంతరంలో మారటం చూస్తున్నాము.  కొన్ని త్వరగా మార్పు చెందవచ్చు కొన్ని ఆలస్యంగా మార్పు చెందవచ్చు. కానీ మార్పు చెందటం మాత్రం సత్యం. 
3) మరణం (అంతం.) మార్పు చెందిన ప్రతిదీ నశించిపోవటం చూస్తున్నాం ఇదే అంతం. జీవులు ప్రాణాలని కోల్పోయి మరణిస్తున్నాయి.  మరణానంతరం జీవ రహిత శరీరాలు పంచ భూతాలలో కలసి పోతున్నాయి. నిర్జీవులు నిత్యం ప్రకృతిలో అనేక రసాయనిక చర్యలు చెంది వాటి ఉనికి కోల్పోయి పంచభూతాలలో ఐక్యం అవుతున్నాయి.  ఉదా :  మనం ఒక కారు చూసాం అది కొంత కాలం కారు రూపంలో వుంది పయనిస్తూ ఉంటుంది.  తరువాత దాని యంత్ర సామాగ్రి అంతా  చెడిపోయి దాని లక్షణాన్ని (నడిచే స్వభావం) కోల్పోతుంది. చివరికి పూర్తిగా తుప్పు పట్టి రూపాన్ని కుడా కోల్పోతుంది ఈ ప్రక్రియ జరగటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ నశించక మాత్రం ఉండదు.  మనం చూసే ఈ దృశ్యమాన జగత్ మొత్తము నశించేదే "ఎత్ దృశ్యం తత్ నశ్యం "  కనబడేది ప్రతిదీ ఏదో ఒక రోజు నశించి పోయేదే. దీన్ని బట్టి మనకు గోచరించేది ఏమిటంటే ఈ జగత్తు శాశ్వితము  కాదు అని. 
దేముడి స్వభావం:  మనం ఈ జగత్తును పరిశీలిస్తే అది మనకు ఆది, మధ్య, అంతాలతో గోచరిస్తూ వున్నది.  మనం ముందే చెప్పుకున్నాం దేముడు ఆది మధ్య అంత రహితుడు అని.  కాబట్టి దేముడు మనకు కనపడడు  ఎందుకంటే కనపడేవి అన్ని కూడా ఫై మూడు లక్షణాలు కలిగినవి.  ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు లేవో అట్టి దేముడు మనకు కనపడటానికి ఆస్కారం లేదు.  దేముడు కనపడితే, దేముడే కాదు. 
ఇతిహాసాలు పరిశిలిస్తే మనకు ఒక విషయం గోచరిస్తుంది.  అది ఇక్కడ తెలుసుకొందాము.  రామాయణంలో మనకు రావణబ్రహ్మ గారు తప్పస్సు చేస్తే పరమ శివుడు ప్రత్యక్షమయి వరాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.  ఇది త్రేతాయుగం.  ఆ తరువాత ద్వాపర యుగంలో భారతంలో పాండవ మధ్యముడు ఐన అర్జనులవారు ఇంద్రకీలాద్రి మీద తప్పస్సు చేస్తే పరమ శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రం బహుకరించినట్లు చదువు కున్నాము.  ఇప్పుడు మనము విశ్లేషణ చేస్తే అక్కడ త్రేతాయుగంలో రావణ బ్రహ్మ గారికి ప్రత్యక్ష మైన పరమ శివుడు ఇప్పుడు ద్వాపర యుగంలో అర్జనుల వారికీ ప్రత్యక్షము ఐనా పరమ శివుడు ఒక్కరే. త్రేతా యుగంలో రావణ బ్రహ్మ గారు గతించారు ద్వాపర యుగంలో అర్జనుల వారు గతించారు.  కానీ పరమ శివుడు ఆ రెండు కాలాల్లో ప్రత్యక్షము అయినట్లు మనకు ఇతిహాసాలు చెపుతున్నాయి. ఇప్పుడు మనం కూడా అచంచల దీక్షతో తప్పస్సు చేస్తే ఆ పరమ శివుడు మనకు కూడా ప్రత్యక్షము కాగలరు.   దీనిని బట్టి మనకు ఒక విషయము బోధ పడుతుంది. అదే ఏమిటంటే ఆ పరమ శివుడు కాలంలో లేరని ఆ దేముడు కాలాతీతుడని.  కాలాతీతుడు ఐన దేముడు మరి ఎలా ప్రత్యక్షం అవుతాడు.  ఇప్పుడు ప్రత్యక్షం అంటే ఏమిటో తెలుసుకుందాము. 
ప్రత్యక్షం: అంటే ఏదైనా మనము చూడటముని ప్రత్యక్షం అని మనం అనుకుంటాము.  కానీ ప్రత్యక్షం అనే పదానికి అర్ధం ఏదైతే మన ఇంద్రియాలకు గోచరం అవుతుంతో అది ప్రత్యక్షం.  మన పంచేద్రియాలకు తెలుస్తుందో అది ప్రత్యక్షం.  ఈ జగత్తులో మనకు కనిపించనిది  ఒక కారణం చేత కనిపించుటే ప్రత్యక్షం.  ఆ దేవదేవుడు సర్వ కాల సర్వావస్థలలో ఉండి ఉండి కేవలము తన భక్తులకు తాత్కాలికంగా గోచరించటమే ప్రత్యక్షం.  కాబట్టి దేముడు కాలంలో లేడు.  కాలమే తనలో వున్నది.  
ద్వయిత ప్రపంచం : అంటే మనం చూస్తున్న ఈ ప్రపంచం మొత్తం తనకన్నా భిన్నంగా గోచరిస్తుంది.  ఈలా వున్నదానిని ద్వైత జగత్తు అంటారు.  అంటే ఇందులో నేను కానిది వున్నది.  అంటే నేను వేరు ఈ ప్రపంచం వేరు.  ఇలా రెండు రకాలుగా కనబడుతున్నది.  అంతే కాక మనకు ఇక్కడ ప్రతిదీ రెండుగా గోచరిస్తుంది. అది లింగ భేదం. రూప బేధం. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ప్రత్యకత కలిగి వుంది ఏ రెండు కూడా పూర్తిగా సారూప్యంగా మనకు కనపడవు.  కొన్ని స్థూలంగా ఒక్క రకంగా వున్నా మనం సూక్ష్మంగా పరీక్షిస్తే ఒకదానికి ఒకటి భిన్నంగా కనబడతాయి. ఇలాంటి ద్వయత జగత్తు నుండి విడివాడటమే మోక్షం.  అదే అద్వయితం బోధిస్తుంది. 
నాస్తిక వాదం : నాస్తికులు దేముడు లేడు అని వాదిస్తున్నారు.  వారికి ఒక సూటి ప్రశ్న.  మనం రోజు చూసే జంతువే కానీ లేక మనిషీ కానీయండి మరణించిన కొద్దీ కాలానికే క్రుళ్లటం (decompose) కావటం చూస్తున్నాము.  కొన్ని బ్యాక్టీరియాలు ఆ శరీర అవయవాలు తినటం వలన ఆ కళేబరం క్రుళ్ళు తున్నది అని సైన్సు చెపుతున్నది.  అది నిజమైతే మరి ఆ జంతువు లేక మనిషి జీవించి వున్నప్పుడు క్రుళ్ల కుండా కాపాడుతున్నది ఎవరు?  ఈ ప్ర్రశ్నకి సరైన సమాధానం ఎవరు చెప్పుతారు. ఇది మన శాస్త్రానికి అంతు చిక్కని ప్రశ్న. జీవి బ్రతికి ఉండటానికి ప్రాణం కారణం అని అంటున్నారు.  ఐతే మరి ఆ ప్రాణం ఏమిటి.  మనకు కనపడదు ఎందుకు. కనపడని దానిని నమ్మటం ఎందుకు?.  సరే నమ్ముదామంటే దానికి ప్రమాణం ఏమిటి.  ఏదైనా ఒక పని జరగాలంటే ఆ పని చేసే వాడు ఉండాలి.  ఆ పని ఆ చేసేవాడి నైపుణ్యం మీద మాత్రమే జరుగుతుంది.  ఒక భవనం నిర్మించాలంటే భావన నిర్మాణ ఇంజనీరు మాత్రమే పని చేయాలి.  అదే ఒక యంత్రం నిర్మించాలంటే యంత్ర నిర్మాణ ఇంజినీర్ వల్లనే సాధ్యం అవుతుంది.  అలానే ఒక రుచికరమైన ఆహార పదార్ధం వండాలంటే వంట చేయగల వంట వాని వల్లనే సాధ్యం అవుతుంది.  ఈ రీతిగా ఒక్కొక్క పని చేయాలంటే ఆ పనిలో ప్రావిణ్యం వున్నవారు మాత్రమే చేయగలరు.  ఒక పని చూసిన వానికి ఆ పని చేసిన వాడు కనపడవచ్చు లేక కనపడక పోవచ్చు కానీ ఆ పని మాత్రం కనపడుతున్నది.  ఏప్పుడో వందల సమస్తరాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఇప్పడికీ మనకు గోచరిస్తూ వున్నాయి నిజానికి ఆ కళాఖండాలను నిర్మించిన కళాకారులు ఎవరో మనకు తెలియదు.  వాళ్ళ పని (work) మాత్రం మనకు కనపడుతున్నది.  దీనిని బట్టి మనం తప్పకుండ నమ్మ వలసిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే పని వున్నదో అప్పుడు పని చేసిన వాడు కుడా ఉంటాడు. ఆ పనివాడు వున్నాడని నిరుపనే అతను చేసిన పని.  కాబట్టి నియతి మనకు గోచరిస్తుంది కాన నియంత వుండివుండాలి.  మనముందు వున్న ఈ దృక్ గోచరాన్ని నమ్మక పోవటం కేవలం అవివేకం మాత్రమే అవుతుంది.   


ఇంకా వుంది  

No comments: