Monday, October 25, 2010

పోతన సాహిత్యం

శ్రీ కైవల్యపదంబు జేరుటకై చింతించెదన్ లోకర
క్షైకారంభాకు పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు గేళి లోలవిలసద్దృగ్జాల సంభూతనా
నాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్
ఎంతటి భక్తునికైన తను భరించలేని కష్టాలు వచినప్పుడు భగవంతునిపి నమ్మకం సన్నగిల్లుతుంది సహజమైన ఆ భావాన్ని ఎంతటి మనోహరమైన పద్యంలో చిత్రికరించాడో చూడండి
కలఁ డందురు దీనులయెడఁ,
గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను,
గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో
జీవుడు తన ప్రయత్నం చేసిన తరువాత తప్పని పరిస్థుతులలో భగవంతునిపిన భారం వేస్తాడు అదే కరి కూడా చేసింది 
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డస్సెన్; శ్రమబయ్యెడిన్;
నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
రావె ఈశ్వర; కావవె వరద; సంరక్షింపు భద్రాత్మకా;
శ్రధగా అర్పనగా భక్తుడు పిలిస్తే భగవంతుడు ఎ స్థితిలో ఉన్న వెను వెంటనే వస్తాడు.  ఈ పద్యాన్ని సాక్షాతూ శ్రీమన్నారయనుడే వచ్చి రచించినట్లు ప్రతీతి.
అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై
ఆర్త త్రాణ పరయనుదిన  నారాయణుడు ఏవిధంగా తరలి వస్తాడో చూడండి 
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.

పోతనామతుని కవిత వెన్నోల పొగడిన తక్కువే ప్రతి పద్యం వక ఆణిముత్యం వకదానికి వకటి ఏమాత్రం తక్కువ కాదు.  ఆ రచనను చదివి అస్వదిన్చావలసిందే తప్ప చెప్పా తరము కాదు 

No comments: