Monday, August 24, 2020

మంచి విచారం

ఈ మయ ప్రపంచంలో సుఖదుఃఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూవుంటాయి. అవి సముద్రపు అలల వంటివి. ఈ సత్యాన్ని నివ్వు ఎందుకు గ్రహించవు....?

కేవలం సుఖం మాత్రమే కావాలను కుంటున్నావా.. ? సుఖదుఃఖాల మధ్యన మన జీవిత సాఫల్యానికి గల అర్థాన్ని గ్రహించాలి.

చిక్కుల్లోనే మానవుడు ఎదుగుతాడు. మనిషి అయినా, జాతి అయినా అంతే. ఇది చరిత్ర చెప్పిన సత్యం.

చెట్టు ఋతువును బట్టి మారుతుంది. శిశిరంలో ఆకురాలుస్తుంది. చెట్టు ఎండినట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి చెట్టు ఎండిపోదు. మళ్లీ వసంతం వస్తుంది. చెట్టు చిగురిస్తుంది. పచ్చని మాను ఔతుంది. జీవితం కూడా అంతే మిత్రమా..... వాడినా..... చిగురిస్తుంది.

బతుకు సఫలం, సార్థకం కావాలంటే మనిషి నిరంతరం సవాళ్లకు సిద్దమై ఉండాలి. భద్రమైన జీవితాన్ని కోరుకునేవారు భవ్యమైన చరిత్రను మిగల్చలేరు...

అనుకోని వ్యాధులు విజృంభిస్తున్నయని, ఆశల అంచనాలు తారుమారు అవుతున్నాయని, మనలను వంచనకు, మోసానికి గురిచేశారని నేడు మనం కకావికలమవుతున్నాం. కానీ... కాస్తా ఆలోచించు... మానవ దేహాన్ని ధరించిన భగవంతుడికి, మహాత్ములకు, మహాపురుషులకు కూడా తప్పలేదు.వారందరు దుఃఖమనే, కష్టమనే సాగరంలో రమిస్తూ.. నడుచుకుంటూ సుధీరతీరాలకు చేరుకున్నారు..కాస్తా యోచించు....

ప్రపంచంలో మనిషులు  ఏదోఒక అసంపూర్తితో వ్యధతో బతుకు వెళ్లదీస్తున్నారు గ్రహించు . నీ కన్నీళ్లు గ్లాసేడే...కానీ,.. ఎదుటి వాడి కన్నీళ్లు బిందెడు.గా ఉంది .ఇతరులను చూసి నీ జీవితాన్ని అన్వయించుకోకు మోసపోతావు...

మిత్రమా... ప్రతివారిలో అనంతమైన శక్తి దాగిఉంది. దాన్ని మేలుకొలుపు. అది ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొనే స్థైర్యాన్ని ఇస్తుంది. నీవు నీ  పట్ల విశ్వాసం కోల్పోతే ఈ విశ్వమే నీకు ఓ పెద్ద ప్రతిబంధకమవుతుంది .

నిర్మల హృదయమే భగవన్నిలయం మనసు నిర్మలంగా ఉంటేనే భగవద్రూపం స్పష్టంగా గోచరిస్తుంది. అద్దం మాలినమైతే ప్రతిభింబం కనబడదు కదా ! అందువల్ల మన హృదయం నిర్మలంగా ఉండేందుకు స్తంభమనే భగవంతుణ్ణి పట్టుకొని, కష్టాల కడలిని దాటుకొంటూ సాగిపో.......
*********************

No comments: