అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము
పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
16.1 (ప్రథమ శ్లోకము)
ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా|
హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్॥6896॥
శ్రీశుకుడు వచించెను - "పరీక్షిన్మహారాజా! దేవతలు ఈ విధముగ స్వర్గమునుండి పారిపోయి దాగికొనగ దైత్యులు స్వర్గాధిపత్యమును పొందిరి. అంతట దేవమాతయైన అదితి అనాథవలె మిగుల దుఃఖించెను".
16.2 (రెండవ శ్లోకము)
ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్|
నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్॥6897॥
"ప్రజాపతియైన కశ్యపుడు చాలదినములకు పిమ్మట ఒకనాడు తన తపస్సమాధి నుండి మేల్కొనెను. అప్పుడప్ఫుడతడు అదితి ఆశ్రమమునకు ఏతెంచెను. అచట సుఖశాంతులుగాని, ఏవిధమైన ఉత్సాహముగాని,…
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ
649వ నామ మంత్రము
ఓం అదృశ్యాయై నమః
దర్శింప వీలుకాని సత్, చిత్, ఆనందం అను ఈ మూడు లక్షణములు కలిగి, అదృశ్యా అను నామముతో వశిన్యాదులచే స్తుతింపబడిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి అదృశ్యా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం అదృశ్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులను ఆ తల్లి వారి భక్తికి సంతసమంది సర్వాభీష్టములను సిద్ధింపజేసి, ఆత్మసాక్షాత్కారము కలిగించి తరింపజేయును.
పంచ లక్షణములైన అస్తి, భాతి, ప్రియం, రూపం నామం అను వాటిలో మొదటి మూడు పరమాత్మ లక్షణములు. ఈ మూడు లక్షణములే సత్, చిత్, ఆనందము అంటారు. ఈ లక్షణములు గల పరమాత్మ దృగ్గోచరము కాదు. అనగా ఈ చర్మచక్షువులతో చూడలేము. కంటికి చూపు, చెవులకు వినికిడి, మిగిలిన ఇతర ఇంద్రియములకు ఆయా లక్షణములను ప్రసాదించునది ఆ పరమాత్మయే. మనకున్న ఇంద్రియాలతో పరమాత్మ గురుంచి తెలుసుకోలేము, కంటితో చూడలేము. అందుకే ఆ పరమేశ్వరి అదృశ్యా అను నామ మంత్రముతో వశిన్యాదులచే ప్రస్తుతింపబడినది. ఇంతకు ముందు నామంలో ఆ జగన్మాతను లీలాక్లప్త బ్రహ్మాండ మండలా అని స్తుతించాము. అంటే బ్రహ్మాండాలన్నీ ఆ తల్లి చేతే సృష్టింపబడుతాయి, తనలోనే ఇముడుతాయి అని. అంటే ఎవరు ఆ తల్లిని చూడగలరు? ఒక్కరైనా చూడగలరా? చర్మచక్షువులతో, సామాన్యులకు అదృశ్య కదా ఆ తల్లి. చూడగలరు. చూసినట్లు భావించగలరు. ఎవరైతే మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథిని ఛేదించుకుంటూ, షట్చక్రములు దాటి, సహస్రారం చేరి అక్కడ అమ్మ కురిపించే సుధామృత ధారలలో (సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ) తడిసిముద్దయిన సాధకుడు మాత్రమే అమ్మను చూశానని తృప్తినందుతాడు. గాన సాధకేతరులెవ్వరికైనా ఆ తల్లి అదృశ్యా అని మాత్రమే భావించాలి.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అదృశ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము) అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻నేడు ఆది (భాను) వారము🌹🌹🌹ఆదివారమునకు దినాధిపతి సూర్యుడు🌻🌻🌻సూర్య వంశమునకు చెందిన రఘురాముని ఆరాధించు శుభదినము🌹🌹🌹ఓం నమో రామభద్రాయ🕉🕉🕉ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ
72వ నామ మంత్రము
ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః
భండుని, భండుని సైన్యాన్ని .వధించుటకు ఉద్యుక్తులయిన శక్తి సైన్యముల పరాక్రమాన్ని చూసి ఆనందించిన తల్లికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ అఖిలాండేశ్వరిని ఉపాసించు సాధకునకు అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదలు, ఆత్మానందానుభూతిని ప్రసాదించి భౌతికపరంగా కూడా సుఖసంతోషములతో జీవనం కొనసాగించి అంత్యమున పరమపదమును కటాక్షించును.
భండాసురుడు జీవాత్మ, పరమాత్మ రెండుగా భావించే అజ్ఞాని. అంతకన్నా కౄరుడు. అసుర ప్రవృత్తి గలవాడు. అహంభావి. అంటే పాంచభౌతిక శరీరమే నేను అనే మూర్ఖుడు. అరిషడ్వర్గములకు లొంగిపోయిన వాడు. ఈ జగత్తు, ఈ
శరీరమే నిత్యమని భావించేవాడు. యథా రాజా తథా ప్రజా కదా అంటే తమ ప్రభువైన భండుడే అలాంటివాడయితే అతని సైన్యం మాత్రం అందుకు తీసిపోతారా? వారు అదే ప్రవృత్తి గలవారు. నిజానికి ద్వైదీభావన (జీవుడు, దేవుడు రెండు అను భావన), అరిషడ్వర్గములను, అహంకారము (నేను అంటే ఈ శరీరమే అను తత్త్వము) ఇలాంటి బాహ్యవృత్తులను నశింపజేసి వాటితో పూర్తిగా కలుషతమైన మనస్సును ప్రక్షాళనము చేయాలి. అప్పుడు స్వస్వరూప జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞాని ముక్తుడవుతాడు. అందుకు భండుడనే బాహ్యప్రవృత్తిని నాశనం చేయడానికి పరమేశ్వరి సైన్యమనే అద్వైతశక్తులు ఉద్యుక్తులయాయి. అటువంటి సేనలను చూసి పరాశక్తి మనసు హర్షాతిరేకముతో నిండిపోయింది. అటువంటి తల్లికి వశిన్యాదులు జగన్మాతకు ఇచ్చిన అనంతకోటి నామాలలో భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా కూడా ఒక నామమును చేర్చి, ఒక మహామంత్రముతో సమానముచేసి జగన్మాతను ప్రస్తుతించారు. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః అని అనవలెను

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అదితిరువాచ
16.11 (పదకొండవ శ్లోకము)
భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ|
త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహా ఇమే॥6906॥
అదితి పలికెను "మహాత్మా! ద్విజులు, గోవులు, ధర్మము మరియు ఈ దాసి అందరమూ కుశలమే. గృహస్థాశ్రమమే ధర్మార్థకామముల సాధనయందు పరమ సహాయకము.
16.12 (పండ్రెండవ శ్లోకము)
అగ్నయోఽతిథయో భృత్యా భిక్షవో యే చ లిప్సవః|
సర్వం భగవతో బ్రహ్మన్ననుధ్యానాన్న రిష్యతి॥6907॥
ప్రభూ! నిన్ను నేను నిరంతరము స్మరించుచునే యుందును. మరియు నీ క్షేమమునే కోరుచుందును. కనుక నేను అగ్నులను, అతిథులను, సేవకులను, మరియు యాచకులను యథాశక్తిగా ఆదరించి, సత్కరించితిని.
16.13 (పదమూడవ శ్లోకము)
కో ను మే భగవన్ కామో న సంపద్యేత మానసః|
యస్యా భవాన్ ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్ ప్రభాషతే॥6908॥
స్వామీ! నీవంటి ప్రజాపతి ధర్మపాలనయందు నాకు ఉపదేశములను ఇచ్చుచుండగా నా మనస్సునందలి ఏ కోరికయైనను ఎట్లు తీరకుండును.
16.14 (పదకొండవ శ్లోకము)
తవైవ మారీచ మనఃశరీరజాః ప్రజా ఇమాః సత్త్వరజస్తమోజుషః|
సమో భవాంస్తాస్వసురాదిషు ప్రభో తథాపి భక్తం భజతే మహేశ్వరః॥6909॥
ఆర్యా! సత్త్వరజస్తమోగుణములు గల ప్రజలందరును నీ సంతానమే. కొందరు నీ సంకల్పము ద్వారా, మరికొందరు శరీరము ద్వారా ఉత్పన్నమైరి. అసురులు, దేవతలు అందరును నీ సంతానమే. అందరియెడ నీవు సమభావమున ఉందువనుటలో ఎట్టి సంశయమూలేదు. ఐనను సాక్షాత్తు పరమేశ్వరుడు గూడ తన భక్తుల అభిలాషలను నెరవేర్చుచునే యుండును.
16.15 (పదునైదవ శ్లోకము)
తస్మాదీశ భజంత్యా మే శ్రేయశ్చింతయ సువ్రత|
హృతశ్రియో హృతస్థానాన్ సపత్నైః పాహి నః ప్రభో॥6910॥
16.16 (పదునారవ శ్లోకము)
పరైర్వివాసితా సాహం మగ్నా వ్యసనసాగరే|
ఐశ్వర్యం శ్రీర్యశః స్థానం హృతాని ప్రబలైర్మమ॥6911॥
స్వామీ! నేను నీకు దాసిని నీవునా శ్రేయస్సునుగూర్చి ఆలోచింపుము. నీవు మర్యాదలను కాపాడుచుండువాడవు. శత్రువులు మన సంపదలను, నివాస స్థానములను గూడ లాగుకొనిరి. నీవు నన్ను రక్షింపుము. బలవంతులైన దైత్యులు మా ఐశ్వర్యములను, ధనమును, యశస్సును, కడకు నివాస స్థానమును గూడ హరించిరి. మమ్ములను మా ఇళ్ళనుండియే వెళ్ళగొట్టిరి. అందువలన నేను దుఃఖసాగరములో మునిగియున్నాను.
16.17 (పదునేడవ శ్లోకము)
యథా తాని పునః సాధో ప్రపద్యేరన్ మమాత్మజాః|
తథా విధేహి కల్యాణం ధియా కల్యాణకృత్తమ॥6912॥
మహాత్మా! నీవు తప్ప మా యశస్సును కోరెడివారు ఎవరున్నారు? నీవు నా హితైషివి. కనుక, నీ పుత్రులు కోల్పోయిన రాజ్యాదులను వారు తిరిగి పొందునట్లు ఏదైనా ఉపాయమును ఆలోచించును. ఆ విధముగా నాకు శుభములను చేకూర్చును".
శ్రీశుక ఉవాచ
16.18 (పదునెనిమిదవ శ్లోకము)
ఏవమభ్యర్థితోఽదిత్యా కస్తామాహ స్మయన్నివ|
అహో మాయాబలం విష్ణోః స్నేహబద్ధమిదం జగత్॥6913॥
16.19 (పందొమ్మిదవ శ్లోకము)
క్వ దేహో భౌతికోఽనాత్మా క్వ చాత్మా ప్రకృతేః పరః|
కస్య కే పతిపుత్రాద్యా మోహ ఏవ హి కారణమ్॥6914॥
శ్రీశుకుడు వచించెను అదితి కశ్యప ప్రజాపతిని ఇట్లు ప్రార్థింపగా అతడు దరహాసము చేయుచు ఆమెతో ఇట్లనెను- "ఇది ఎంత ఆశ్చర్యకరము! భగవంతుని మాయ ఎంత బలీయమైనది! జగత్తు అంతయు మోహపాశముతో బంధింపబడి యున్నది పంచభూతములతో నిర్మింపబడిన, అనాత్మయైన ఈ దేహమెక్కడ? ప్రకృతికి అతీతమైన ఆత్మ ఎక్కడ? ఎవరికి ఎవ్వరును పతిగాని, పుత్రుడుగాని, బంధువుగాని కారు. ఈ అందరినీ మోహమే ఆడించుచున్నది.
16.20 (ఇరువదియవ శ్లోకము)
ఉపతిష్ఠస్వ పురుషం భగవంతం జనార్దనమ్|
సర్వభూతగుహావాసం వాసుదేవం జగద్గురుమ్॥6916॥
16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
స విధాస్యతి తే కామాన్ హరిర్దీనానుకంపనః|
అమోఘా భగవద్భక్తిర్నేతరేతి మతిర్మమ॥6916॥
దేవీ! ఆ పరమపురుషుడు సకల ప్రాణుల హృదయములయందు విరాజిల్లు చుండువాడు. తన భక్తుల దుఃఖములను తొలగించువాడు. జగద్గురువు, భగవంతుడు ఐన వాసుదేవుని ఆరాధింపుము. ఆ శ్రీహరి దీనదయాళువు. అతడు నీ కోరికలను తప్పక నెరవేర్చును. భగవద్భక్తి ఎన్నడును వ్యర్థముకాదని నా దృఢ విశ్వాసము. ఇంతకంటె మరియొక ఉపాయము లేనేలేదు'.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319
--

No comments:
Post a Comment